పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవల కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ దాంతో భారీ విజయాన్ని అందుకున్నాడు. దాదాపుగా వెయ్యికోట్లకు  పైగా వసూళ్లు అందుకున్న కల్కి తర్వాత పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. అయితే కెరియర్ పరంగా ఆచితూచి అడుగులు వేస్తున్న ప్రభాస్ పెళ్లి విషయంలో మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోవడం లేదు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ తీస్తే అందులో ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు.

 ప్రభాస్ కి ప్రస్తుతం 44 ఏళ్ళు. ఈపాటికి ఆయన పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తండ్రి కూడా అవ్వాలి. ఆయన తోటి నటీనటులు అందరూ ఇప్పటికే పెళ్లిళ్లు చేసుకొని ఇద్దరు ముగ్గురు పిల్లల్ని భార్యని వేసుకొని సంతోషంగా ఉంటున్నారు. కానీ ప్రభాస్ మాత్రం ఇంకా డార్లింగ్ అని అనిపించుకుంటున్నాడు. మరి ఈ డార్లింగ్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడో అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆయన అభిమానులు. అయితే పెళ్లి గురించి ఎప్పుడు ప్రస్తావించిన ఏదో ఒక కారణం చెప్పి, కవర్ చేసి తప్పించుకున్నాడు ప్రభాస్. అనేక షోలలో పెళ్లిపై, పెళ్లిపిల్లపై కౌంటర్స్ సైతం వేశాడు ప్రభాస్. అలాంటి డార్లింగ్ అతి త్వరలో పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు కాబోతున్నడని

 తెలుస్తోంది. ప్రభాస్ పెళ్లి గడియలు చాలా దగ్గర్లో ఉన్నాయని అర్థం అవుతోంది.అయితే ప్రభాస్ గురించి ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ప్రభాస్ గతంలో త్రిషతో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడన్నాని తెలిపారు సినీ జర్నలిస్టు ఈమంచి రామారావు. ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..గతంలో త్రిషతో ప్రభాస్ పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని తెలిపారు.వీరి కెమిస్ట్రీకి సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యేవి. ఇద్దరికీ నిశ్చితార్థం జరిగిపోయిందని చాలామంది భావించేవారు. అయితే ప్రభాస్‌.. త్రిషని పక్కన పెట్టడానికి కారణం తమిళ పరిశ్రమకు చెందిన ఓ హీరోతో సన్నిహితంగా ఉండడం .హీరోతో బాగా సన్నిహితంగా త్రిష ఉండటం ప్రభాస్ కు నచ్చలేదు. కాని త్రిషకి ప్రభాస్ కండీషన్స్ పెట్టడం నచ్చలేదు.దీంతో త్రిష.. ప్రభాస్‌ని దూరం పెట్టగా, తన జీవితంలోకి వచ్చే అమ్మాయి అంత స్వేచ్ఛగా ఉంటే బాగుండదని భావించిన డార్లింగ్ త్రిషకు దూరంగా ఉండటం చేశాడు. అలా అప్పటినుండి ప్రభాస్ పెళ్లిళ్లకు దూరంగా ఉన్నాడట..!!

మరింత సమాచారం తెలుసుకోండి: