కోలీవుడ్ స్టార్ హీరో, విలక్షణ నటుడు విక్రమ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ తంగలాన్. ఈ చిత్రానికి పా. రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 15 వ తేదీన థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ ను షురూ చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే నేడు సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేశారు. తంగలాన్ వార్ గా సాగే ఈ పాట ప్రేక్షకులను అలరిస్తోంది. తంగలాన్ పాత్రకి సంబందించిన కొన్ని వీరోచిత

 సన్నివేశాలను పాటలో చూపించే ప్రయత్నం చేశారు. పాట రిలీజైన కొద్ది సేపటికే సూపర్ రెస్పాన్స్ తో దూసుకు పోతుంది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో మాళవిక మోహనన్ ఇంట్రెస్టింగ్ రోల్ లో నటిస్తుంది. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని విక్రమ్ ఫస్ట్ లుక్ ప్రేక్షకులను మెప్పించింది. అదే విధంగా ఈ చిత్ర ట్రైలర్ ఇటీవల విడుదల కాగా సినిమాపై

 మరింత ఆసక్తిని పెంచాయి. ఆగస్టు 15న విడుదల కానున్న తంగలాన్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్, ఈ నేపథ్యంలో తెలుగులో ఓ భారీ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. హైదరాబాద్ లోని ట్రైడెంట్ హోటల్ లో రేపు సాయంత్రం 6:00గంటలకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి చిత్ర హీరో చియాన్ విక్రమ్, దర్శకుడు పా. రంజిత్ తో పాటు టాలీవుడ్ ప్రముఖులు హాజరు కానున్నారు. భారీ అంచనాల మధ్య కేజీఎఫ్ గోల్డ్ నేపథ్యంలో రానున్న ఈ చిత్రాన్ని రూ. 100 కోట్లతోగ్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించగా, తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ను మైత్రీ మూవీస్ కొనుగోలు చేసింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: