హిందీ బిగ్ బాస్ షో ఓటిటీ సీజన్-3 ఇటీవల ఎండ్ కార్డ్   పడింది. జూన్ 21వ తేదీన ప్రారంభమైన ఈ కొత్త సీజన్.. నిన్నటి రోజున ఫైనల్ తో ముగిసింది. చాలా మంది ఊహించినట్లుగానే ప్రముఖ హీరోయిన్ హిందీ బిగ్ బాస్ ఓటిటి సీజన్-3 విన్నర్ గా అందుకుంది. రాప్ సింగర్ నేజి రన్నరపుగా నిలవడం జరిగింది.. అలాగే వీరితో పాటు రణబీర్ షోరే, కృతిక మాలిక్, సాయి కేతన్ టాప్ ఫైవ్గా నిలిచారు. అయితే ఈ సీజన్ అంతా కూడా తన ఆట తీరుతో మాట తీరుతో అందరిని ఆకట్టుకుంది సనా మక్బూల్.


సోషల్ మీడియాలో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకోవడంతో కచ్చితంగా ఈమె బిగ్ బాస్ ఓటిటి -3 విన్నర్ గా నిలుస్తుందని అందరూ అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఇమే గెలిచింది. హోస్టుగా అనిల్ కపూర్ ఈమెకు 25 లక్షల రూపాయల చెక్కుని సైతం అందించారు. అలాగే వీటితోపాటు కొన్ని బహుమతులు కూడా అందించారట. గతంలో సల్మాన్ ఖాన్ హొస్టుగా వ్యవహరించినప్పటికీ మూడో సీజన్కు మాత్రం అనిల్ కపూర్ ని హోస్టుగా తీసుకురావడం జరిగింది బిగ్ బాస్ నిర్వాహకులు.


ఓటిటి సీజన్-3 లో చాలామంది ప్రముఖులు సైతం పాల్గొనడం జరిగింది.. ఆర్మాన్ మాలిక్ తన భార్యలతో కలసి హౌస్ లోకి అడుగుపెట్టినప్పటికీ వీరి పైన చాలా విమర్శలు కూడా ఎక్కువగా వినిపించాయి.దీంతో వీరిపై పోలీస్ కేసు కూడా నమోదు అయింది.. విన్నర్ గా నిలిచిన సనా మక్బూల్ విషయానికి వస్తే ఈమె తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే 2014లో నాగశౌర్య నటించిన దిక్కులు చూడకు రామయ్య అనే చిత్రంలో ఇమే హీరోయిన్గా నటించిందట.ఆ తర్వాత 2017లో విడుదలైన మామ ఓ చందమామ అనే చిత్రంలో కూడా హీరోయిన్గా నటించినట్లు సమాచారం. వీటితోపాటు పలు తమిళ సినిమాలలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈయనకు సంబంధించి ఈ విషయం అయితే వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: