భూమిక ఒకప్పుడు తన అందంతో ఎంతోమంది కుర్రకారును ఫిదా చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. అయితే అప్పుడప్పుడు అడపా దడపా సినిమాలు చేస్తూ నేనూ ఇండస్ట్రీలో ఉన్నాను అంటూ అందరికీ గుర్తు చేస్తుంటుంది. ఇక సినిమాల్లో అవకాశాలు ఎలా ఉన్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ అవకాశాల కోసం ఎన్నో తంటాలు పడుతుంది. ఇక అలాంటి భూమిక పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఆమె నడుము.మన టాలీవుడ్ లో నడుము పేరు చెప్పగానే ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు గుర్తుకొస్తారు. అందులో ఒకరు ఇలియానా మరొకరు భూమిక.. ఈ ఇద్దరు హీరోయిన్స్ నడుముకు టాలీవుడ్ లో ఎంతోమంది వీరాభిమానులు ఉన్నారు. ఈ విషయం పక్కన పెడితే భూమిక ఖుషి సినిమాలో ఉన్న నడుము సీన్ ద్వారా చాలా ఫేమస్ అయింది. 

అయితే ఖుషి సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో భూమిక మాట్లాడుతూ నేను ఖుషి సినిమా సమయంలో డైరెక్టర్ చేసిన పనికి మొదట్లో చాలా బాధపడ్డాను. ఆ డైరెక్టర్ మూడ్ బాలేకపోతే నేను వేసుకున్నది అంతా తీయించేశాడు అంటూ భూమిక మాట్లాడింది. మరి ఇంతకీ భూమిక మాట్లాడింది ఏ విషయం గురించి అనేది ఇప్పుడు చూద్దాం.. ఎస్.జె.సూర్య దర్శకత్వంలో ఏ.ఎం.రత్నం నిర్మాతగా వ్యవహరించిన ఖుషి మూవీలో పవన్ కళ్యాణ్,భూమిక లు హీరో హీరోయిన్లుగా చేశారు.అయితే ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పిసి శ్రీరామ్ చేశారు. అయితే శ్రీరామ్ వల్ల భూమిక ఓ సమయంలో చాలా బాధపడిందట. అదేంటంటే.. పవన్ కళ్యాణ్ భూమికలు గుడిలో ఒక ఆరిపోతున్న దీపాన్ని ఆరిపోకుండా తమ ఇద్దరి చేతులు అడ్డు పెడతారు. అయితే ఆ సన్నివేశం షూట్ చేసే సమయంలో భూమిక లైట్ గా మేకప్ వేసుకుందట.

కానీ ఇది నచ్చని సినిమాటోగ్రాఫర్ శ్రీరామ్ వెంటనే మోహం కడుక్కొని రమ్మన్నారట. మేకప్ కాస్త కూడా ఉండకూడదని చెప్పారట. దాంతో నేను మేకప్ కొద్దిగానే వేసుకున్నాను అని భూమిక చెప్పినా వినలేదట. ఇక చేసేదేమీ లేక భూమిక మేకప్ తీసేసిందట.అంతేకాకుండా ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎక్కడా కూడా ఆమె మేకప్ ధరించలేదట. అప్పుడప్పుడు చిన్న చిన్న సన్నివేశాల్లో భూమిక కొంచెం మేకప్ వేసుకుందట. అయితే ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో భూమిక చెబుతూ.. శ్రీరామ్ గారు ఆరోజు అలా మేకప్ తీసేయమని అందరిముందు అనడంతో నేను చాలా బాధపడ్డాను. ఆ తర్వాత రియలైజ్ అయ్యి బహుశా ఆ సీన్ షూట్ చేసే సమయంలో ఆయన మూడ్ బాలేదు కావచ్చని అనుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది

మరింత సమాచారం తెలుసుకోండి: