అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఇకపోతే ఆఖరుగా జూనియర్ ఎన్టీఆర్ "ఆర్ ఆర్ ఆర్" అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకొని 1200 కోట్లకు పైగా కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా కొల్లగొట్టింది. అలాగే ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు కూడా దక్కింది. ఈ మూవీ తో జూనియర్ ఎన్టీఆర్ కి గ్లోబల్ గా క్రేజ్ దక్కింది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర పార్ట్ 1 సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. మొత్తం రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా యొక్క మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. 

జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ , బాబి డియోల్ విలన్ పాత్రలలో కనిపించబోతున్నారు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన థియేటర్ హక్కులను అమ్మి వేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన కర్ణాటక థియేటర్ హక్కులను అమ్మివేసింది.

మూవీ యొక్క కర్ణాటక థియేటర్ హక్కులను కెవిఎన్ ప్రొడక్షన్స్ , షోవింగ్ బిజినెస్ సంస్థలు సంయుక్తంగా దక్కించుకున్నాయి. ఇకపోతే ఈ సినిమా యొక్క కర్ణాటక ధియేటర్ హక్కులను దక్కించుకున్నట్లు ఈ సంస్థలు తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశాయి. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతానికి దేవర మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ని తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: