సినిమా ఇండస్ట్రీలో ఒకరిని అనుకొని ఆ పాత్ర కోసం వారిని సంప్రదించిన సమయంలో వారికి వేరే సినిమాలతో బిజీ గా ఉండడం వలనో లేక ఆ సినిమా కథ నచ్చకపోవడం వలనో లేక అందులో తమ పాత్ర నచ్చకపోవడం వలనో లేక వేరే ఇతర కారణాల వలన సినిమాలను రిజెక్ట్ చేయడం , అందులోకి వేరే వాళ్ళు నటించడం అనేది చాలా సర్వ సాధారణంగా జరుగుతూ ఉంటాయి. ఇకపోతే వారు రిజెక్ట్ చేసిన సినిమా కనుక బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన , వారిని అనుకున్న పాత్రకు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు రాకపోయినా ఆ సినిమా రిజెక్ట్ మంచిది అయింది అని వారు భావిస్తూ ఉంటారు.

ఇక వారిని అనుకున్న సినిమా అద్భుతమైన విజయం సాధించిన , లేకపోయినా వారి కోసం అనుకున్న పాత్రకు మంచి గుర్తింపు వచ్చిన ఆ రోజు ఆ సినిమాను చేసి ఉంటే బాగుండేదేమో అని అనుకునేవారు అనేక మంది కూడా చాలా మంది ఉంటారు. ఇకపోతే అలాంటి ఆలోచనలే అర్చన కూడా వ్యక్తం చేసింది. తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటి మనలలో అర్చన ఒకరు.

రామ్ చరణ్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా రాజమౌళి దర్శకత్వంలో మగధీర మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఇందులో సలోని ఓ కీలకమైన పాత్రలో నటించింది. మగధీర మూవీలో సలోని పాత్ర కోసం మొదట అర్చన నే రాజమౌళి సంప్రదించాడట. కానీ ఈ సినిమాకు ఈ బ్యూటీ నో చెప్పింది. ఒకానొక ఇంటర్వ్యూలో ఈమె ఆ సినిమాకు నో చెప్పకపోతే బాగుండేది అని ఇప్పటికే అనుకుంటున్నాను అని ఈమె తెలియజేసింది. అర్చన గనుక మగధీర సినిమాలోని సలోని పాత్రను చేసి ఉంటే ఈమెకు అద్భుతమైన స్థాయి గుర్తింపు వచ్చేది అని చాలా మంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: