తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. ఈయన ఆఖరుగా పుష్ప పార్ట్ 1 అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించి బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అలాగే ఈ మూవీ లోని అల్లు అర్జున్ నటనకు కూడా ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. అలాగే ఈ సినిమాలోని నటనకు అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ప్రస్తుతం అల్లు అర్జున్ "పుష్ప పార్ట్ 2" మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. అల్లు అర్జున్ "పుష్ప పార్ట్ 2" మూవీ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.

కానీ ఇప్పుడు ఆ వార్తలు అన్ని సైలెంట్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ కు బన్నీ వాసు అత్యంత స్నేహితుడు అనే విషయం మన అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ కు సంబంధించిన దాదాపు అన్ని విషయాలు ఈయనకు తెలుస్తూ ఉంటాయి. తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా అల్లు అర్జున్ , బోయపాటి కాంబో మూవీ కి సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను బన్నీ వాసు తెలియజేశాడు.

తాజా ఇంటర్వ్యూలో భాగంగా బన్నీ వాసు మాట్లాడుతూ ... అల్లు అర్జున్ తో బోయపాటి శ్రీను ఒక సినిమా చేయవలసి ఉంది. అందుకు ఆయనకు అడ్వాన్స్ కూడా ఇచ్చాం. కాకపోతే పుష్ప పార్ట్ 2 మూవీ అనుకున్న సమయానికి పూర్తి కాలేదు. దానితో ఆయన కూడా వెయిట్ చేయడం కరెక్ట్ కాదు. అంతలోపు బోయపాటి శ్రీను కి మరొక ఆఫర్ వచ్చింది. దానితో ఆయన ఆ సినిమా చేయబోతున్నాడు. ఇక అల్లు అర్జున్ , బోయపాటి శ్రీను కాంబో లో మూవీ అయితే ఉంటుంది  కానీ అది ఎప్పుడూ అనేది సరిగ్గా చెప్పలేం అని బన్నీ వాసు తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

aa