వైసీపీకి చెందిన మాజీమంత్రి నగరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఈ ఎన్నికలలో చిత్తుచిత్తుగా ఓడిపోయారు. పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లపాటు ఆమె ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అయితే ఇప్పుడు పార్టీ ఓడిపోవడంతో ఆమె తిరిగి టీవీ ఫీల్డులో అవకాశాల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మరియు ముఖ్యంగా తమిళ్ టీవీ ఛానల్ లో అవకాశాల కోసం ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఓడిపోయాక రోజా ఎక్కువగా చెన్నైలోనే ఉంటున్నారు.. ఒకటి రెండు సార్లు బయటకు వచ్చి మాట్లాడిన ఆమె తిరుమల లో చేసిన టిక్కెట్ల దందా ... మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అవకత అవకత‌వ‌క‌లు.. ఇటు నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చేసిన రకరకాల అవినీతి ... అక్రమాలపై వరుసగా ఫిర్యాదులు వస్తున్నాయి.


దీంతో ఇప్పుడు ఆమె రాజకీయంగా పూర్తిగా సైలెంట్ అయిపోయారు .. చెన్నైలోనే ఉంటున్న రోజా వచ్చే ఐదేళ్ల కాలం ఖాళీగా ఉండలేమని ఉపాధి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. తనకు మంచి ఫేమ్‌ తెచ్చి పెట్టిన జబర్దస్త్ లో జడ్జి అవకాశం కోసం మల్లెమాల ఎంటర్టైన్మెంట్ను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే తమిళ్ టీవీ ఛానల్ తో రోజా సంప్రదింపులు జరుగుతున్నట్టు సమాచారం. గతంలో తమిళంలో కూడా కొన్ని షోలకు రోజా పనిచేశారు. అయితే పొలిటికల్ గా నెగిటివ్ ఎక్కువగా ఉండడంతో ఇప్పుడు రోజాను తిరిగి టీవీ ఛానల్ లోకి తీసుకుంటారా ? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.


అయితే తమిళనాడులో టీవీ ఛానల్ నుంచి ఆమెకు ఒకటి రెండు అవకాశాలు వచ్చే ఛాన్సులు ఉన్నాయని చెబుతున్నారు. ఎలాగైనా తమిళ బుల్లితెర మీద తన భార్యను పాపులర్ చేయాలని రోజా భర్త ఆర్కే సెల్వ‌మ‌ణి కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. రోజా ఇప్పట్లో రాజకీయంగా యాక్టివ్ అయ్యే అవకాశాలు లేవని మరో రెండేళ్ల వరకు ఆమె చుట్టపు చూపుగానే ఏపీకి నగర నియోజకవర్గానికి వస్తారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: