బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన యువ నటీమణుల్లో జాన్వీ కపూర్ ఒకరు. ఈమె బోనీ కపూర్ , శ్రీదేవి నట వారసురాలిగా బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో బోనీ కపూర్ , శ్రీదేవికి మంచి గుర్తింపు ఉండడంతో జాన్వీ కపూర్ కి వరుసగా హిందీ సినిమాలలో అవకాశాలు దక్కాయి. ఇక ఈమె ఇండస్ట్రీ లోకి భోని కపూర్ , శ్రీదేవి క్రేజ్ వల్ల ఎంట్రీ ఇచ్చిన ఆ తర్వాత మాత్రం తన సొంత టాలెంట్ తోనే ఈమె ఇండస్ట్రీలో నిలదొక్కుకో గలిగింది. ప్రస్తుతం ఈమె హిందీ సినీ పరిశ్రమలో వరుస అవకాశాలను అందుకుంటుంది.

అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ ఉలఘ్ అనే సినిమాలో నటించింది  ఈ మూవీ ఆగస్టు 2 వ తేదీన మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా విడుదల సందర్భంగా ఈ ముద్దుగుమ్మ చాలా ఇంటర్వ్యూలలో పాల్గొంది. అందులో భాగంగా ఈమె తాను సినిమా కోసం ఏ పనైనా చేస్తాను కానీ జుట్టు మాత్రం కత్తిరించుకోను అని చెప్పింది. అలాగే నా కెరీర్ లో ఫస్ట్ సినిమా ధడక్‌ కోసం జుట్టు కత్తిరించుకున్నా. దాంతో మా అమ్మ ఎందుకిలా చేశావ్‌ అని అంటూ చాలా కోప్ప‌డింది.

నా జుట్టంటే మా అమ్మ‌కు ఎంతో ఇష్టం. దానితో మూడు రోజులకొకసారి ఆయిల్‌ రాసి మసాజ్‌ కూడా చేసేది. ఏ రోల్ కోస‌మైనా హెయిర్ ను మాత్రం క‌ట్ చేయించుకోవ‌ద్ద‌ని అమ్మ స్ట్రిక్ట్ గా రూల్ ను పెట్టింది. అది నేను త‌ప్ప‌కుండా ఫాలో అవుతాను అంటూ జాన్వీ క‌పూర్ తాజాగా చెప్పుకొచ్చింది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ నటించిన ఉలఘ్ సినిమాలోని పాత్ర కోసం కూడా ఈ మూవీ దర్శకుడు జుట్టు కత్తిరించుకోమన్నాడు , కానీ నేను మాత్రం అది కుదరదు అని చెప్పాను. దానితో ఆయన కూడా నా ఫీలింగ్స్ ను అర్థం చేసుకొని జుట్టు కత్తిరించకుండానే సన్నివేశాలను చిత్రీకరించాడు అని జాన్వీ కపూర్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: