టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జబర్దస్త్ షో ద్వారా బుల్లితెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ షోతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఆ షోలో యాంకరింగ్ చేస్తూనే సినిమాలలో అవకాశాలను అందుకుంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ ఏమాత్రం తరగని అందంతో వరుస సినిమాలలో నటిస్తుంది. ప్రస్తుతం తన యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేసి వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది.



ప్రస్తుతం అనసూయ పుష్ప2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక సినిమాల్లో ఎప్పుడూ బిజీగా ఉండే అనసూయ సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తూ ఉంటుంది. తన అభిమానులుతో ముచ్చటిస్తూ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉంటుంది. అంతేకాకుండా నిత్యం సోషల్ మీడియాలో తన హాట్ అందాలతో కుర్రాళ్ళ మతులు పోగుడుతూ ఉంటుంది. ఇక సమయం దొరికినప్పుడల్లా తన కుటుంబసభ్యులతో కలిసి వెకేషన్ కి వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. 


ఇక ప్రస్తుతం అనసూయకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇద్దరు పిల్లలకి తల్లి అయినప్పటికీ అనసూయ ఇంకా చిన్న పిల్లలాగా అర్ధరాత్రి పూట ఐస్ క్రీమ్ తినేందుకు బయటకు వెళుతూ ఉంటుందట. ఈ విషయం తెలిసి కొంతమంది నెటిజెన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇద్దరు పిల్లలకు తల్లి అయితే ఏంటి ఐస్ క్రీమ్ తినడానికి వెళ్లకూడదా అని అనసూయ అభిమానులు సపోర్ట్ చేస్తుంటే.... మరి కొంతమంది ఏమో అర్ధరాత్రి పూట ఐస్క్రీమ్ తినడం అవసరమా అని నెగటివ్ గా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: