తమిళ ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడిగా పేరుపొందిన నెపోలియన్ బాగానే పేరు సంపాదించారు. అయితే తన పెద్ద కుమారుడు ధనుష్ కు త్వరలోనే వివాహం చేయబోతున్నారట. అయితే తన పెద్ద కుమారుడు జబ్బు కారణంగా వీల్ చైర్ కె కొన్నేళ్లుగా పరిమితమయ్యాడు.. ఇలాంటి సమయంలో వివాహం చేసుకోవడం ఎట్లా అంటూ కోలీవుడ్లో పెద్ద ఎత్తున పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. ఎన్నో చిత్రాలలో విలన్ గా నటించి పేరు సంపాదించుకున్న నెపోలియన్ పలు చిత్రాలలో హీరోగా కూడా నటించారట.


పొలిటికల్పరంగా ఎంట్రీ ఇచ్చి కేంద్ర మంత్రిగా కూడా నెపోలియన్ పనిచేశారు. కొన్నేళ్ల క్రితం ఇండస్ట్రీ వదిలి తన కుమారుడి ఆరోగ్యం కోసం అమెరికాకు వెళ్లిపోయారు. నటుడు నెపోలియన్ కుమారుడు.. ధనుష్ కు నాలుగేళ్ల వయసులోనె కండరాల బలహీనత అనే వ్యాధితో ఇబ్బంది పడ్డారట.. దీంతో తన శరీరం అంతా కూడా చచ్చుబడిపోయి అప్పటినుంచి వీల్ చైర్కే పరిమితమయ్యారని తెలుస్తోంది. కానీ ఇప్పుడు తన కుమారుడికి పెళ్లి చేస్తూ ఉండడంతో ఒకసారిగా ఈ విషయం వైరల్ గా మారింది. తిరునల్వేలికి చెందిన అక్షయ అనే అమ్మాయితో ధనుష్ వివాహం ఈ ఏడాది నవంబర్లో జరగబోతుందట. జపాన్ వేదికగా వీరి వివాహం జరగబోతోంది.

వీరినిశ్చితార్దానికి  సంబంధించి ఇప్పటికే పలు రకాల వీడియో కాల్స్ ద్వారా జరిగిందని అమెరికా నుంచి చెన్నైకి వచ్చేందుకు కూడా ధనుష్ ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇలా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు త్వరలోనే వివాహం జరగబోతుందని ప్రచారం జరుగుతూ ఉండడంతో సరికొత్త వివాదానికి దారితీస్తోంది. తన లాంటి కుమారుడికి పెళ్లి చేసి ఆ యువతీ జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారంటూ పలువురు నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.. కేవలం డబ్బు ఆశ చూపి ఆమె జీవితాన్ని నాశనం చేయొద్దు నెపోలియన్ అంటూ మరికొంత మంది ఈ నటుడు పైన ఫైర్ అవుతున్నారు. మరి కొంతమంది తన కుమారుడు అలాంటి వారితో బ్రతకడం గొప్ప అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: