ఎలాంటి పాత్రలోనైనా సరే అద్భుతంగా నటించగల సత్తా ఉన్న నటుడు జూనియర్ ఎన్టీఆర్. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఆయన నటనకు ఎంతటి గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పినవసరం లేదు. ఎటువంటి కష్టమైన డైలాగ్స్ అయినా సరే ఒకటే టేక్ లో చేయగల సత్తా ఉన్న నటుడు జూనియర్ ఎన్టీఆర్. డాన్స్ విషయంలో కూడా చాలామంది హీరోలను దాటుకొని వెళుతున్నారు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఖ్య రోజుకి పెరిగిపోతోంది. ఇదిలవుండగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ హీరోగా మారిపోయారు. 

ప్రస్తుతం ఉన్న యువ నటుల్లో నవరసాలను పోషించగలిగే ఏకైక నటుడు ఎన్టీఆర్. కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబరు 27వ తేదీన విడుదల కాబోతోంది. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా మొదటి భాగంపై పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు భారీగా ఉన్నాయి. హృతిక్ రోషన్ తో కలిసి వార్2 చేస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం కాబోతోంది.  అయితే ఇలాంటి సమయంలోనే ఎన్టీఆర్ గురించి ఒక న్యూస్ వైరల్ గా మారుతున్నది. 

అదేమిటంటే డైరెక్టర్ లోకేష్ కనకరాజు తో దేవర సినిమా కంటే ముందుగానే ఒక సినిమాని చేయవలసి ఉన్నదట.. ఆ చిత్రము ఏదో కాదు విక్రమ్.. అయితే ఈ ప్రాజెక్టుకి ఎలాంటి పాత్రలోనైనా సరే అద్భుతంగా నటించగల సత్తా ఉన్న  ఎన్టీఆర్ సైతం ఒప్పుకోలేదట.. అందుకు కారణం కేవలం దేవర సినిమాకి కొరటాల శివకు మాట ఇవ్వడం వల్ల విక్రమ్ సినిమాని త్యాగం చేయవలసి వచ్చిందట.. దేవర రెండు భాగాలుగా ఉండడంవల్ల.. ఈ సినిమాకి ఎక్కువగా డేట్లు కేటాయించారట.. అలా డైరెక్టర్ లోకేష్ కి ఇబ్బంది వస్తుందని ఆలోచించి ఆ సినిమానే వదిలేసుకున్నారట ఎన్టీఆర్. లేకపోతే విక్రమ్ సినిమాతో మరో బ్లాక్ బాస్టర్ అందుకునేవారు ఎన్టీఆర్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: