కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాక్కర్లేదు. విలక్షణ నటుడిగా ఎప్పుడూ డిఫరెంట్ కాన్సెప్ట్లతో సినిమాలను చేస్తూ ఉంటాడు. హిట్స్ ఫ్లాప్స్ అన్న సంబంధం లేకుండా ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. కేవలం తమిళంలోనే కాకుండా ఇప్పుడు స్ట్రైట్ గా తెలుగులో కూడా సినిమాలను చేస్తూ తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నాడు. అయితే తాజాగా ధనుష్ రాయన్ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఆయన కెరియర్లో 50వ సినిమా గా వచ్చిన ఈ సినిమా ఆయన  స్వీయ దర్శకత్వంలో వచ్చింది. ఇక ఈ 26న థియేటర్లలో విడుదలై 7 రోజుల్లో

 బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసిందనే విషయం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. దీని ప్రకారం విడుదలైన 7 రోజులకు ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 102 కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించింది. ధనుష్ 50వ చిత్రం రాయన్ 7 రోజుల్లో రూ. 100 కోట్ల బాక్సాఫీస్ హిట్ కొట్టడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ కు మరో అరుదైన గౌరవం దక్కిందని తెలుస్తోంది. ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ లైబ్రరీలో రాయన్ స్క్రీన్ ప్లే శాశ్వతంగా చోటు దక్కించుకుంది. ఈ తర్వాత ది వ్యాక్సిన్ వార్, పార్కింగ్ లకు కూడా ఇదే గౌరవం దక్కింది.

దాంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ చిత్రంలో దుషార విజయన్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, ఎస్.జె.సూర్య, సెల్వరాఘవన్, అపర్ణ బాలమురళి కీలకపాత్రల్లో నటించారు. నార్త్ చెన్నై కథాంశంతో ఈ రూపొందింది. అలాగే ఈ లో ధనుష్ ఇప్పటి వరకు ఏ లో కనిపించనంత మాస్ అండ్ రగడ్ లుక్ లో కనిపించాడు.తమిళ స్టార్ ధనుష్ హీరోగా చేస్తూ దర్శకత్వం వహించిన సినిమానే 'రాయన్' . సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాలో తెలుగు హీరో సందీప్ కిషన్ మరో కీలక పాత్రను పోషించాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: