జబర్దస్త్ ద్వారా ఇప్పటికే చాలామంది మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అందులో చాలా మంది హీరోలుగా కొనసాగుతున్నారు  అయితే అలా జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో రాకింగ్ రాకేష్ కూడా ఒకరు. ఆయన కామెడీ టైమింగ్ తో అందరిని ఆకట్టుకుంటూ ఉంటాడు. తనదైన స్కిట్స్ తో ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే ఒకవైపు జబర్దస్త్ చేసుకుంటూనే.. పలు షోలు కూడా చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. అయితే రాకింగ్ రాకేష్ జోర్దార్ సుజాతను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మ్యారేజ్ తర్వాత కూడా వీరిద్దరు కలిసి జబర్దస్త్‌లో స్కిట్లు కూడా చేస్తున్నారు.

 వీళ్ల జోడీకి మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉంది. అయితే రాకింగ్ రాకేష్ తమ అభిమానులకు ఒక గుడ్ న్యూస్ అంటూ ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. తాజాగా రాకింగ్ రాకేష్ తన ఇన్‌స్టా గ్రామ్ వేదికగా తన వైఫ్ బేబిపంప్‌తో ఉన్న పిక్స్ షేర్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టాడు. అంతే కాకుండా “అమ్మా నాన్నా అనే పిలుపుకు దగ్గర్లో.. గొప్ప తల్లిదండ్రులు కావాలని ఆశీర్వదించండి” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవ్వగా.. నెటిజన్లు, సెలబ్రిటీలు, అభిమానులు వారికి విషెస్ తెలుపుతున్నారు. అలాగే బుల్లి రాకింగ్ రాకేష్ అన్న రాబోతున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు సుజాత

 సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా రన్ చేస్తుంది. ఈ ఛానెల్ లో తన లైఫ్‌లో జరిగిన విషయాలతో పాటు రకరకాల విషయాలను పంచుకుంటుంది.  ఇందుకు సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో సుజాత మాట్లాడుతూ.. ఓ మంచి సందర్భంగా చూసి ఈ సంతోషకరమైన విషయాన్నీ చెప్పాలనుకున్నాను.. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. రాకింగ్ రాకేష్ తండ్రి కాబోతున్నాడు అని సుజాత చెప్పగానే రాకేష్ ఎమోషనల్ అయ్యాడు. అలాగే సీమంతం జరిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమ ఆనందాన్ని తమ ఫాలోవర్స్, ఫ్యాన్స్‌తో పంచుకున్నారు ఈ లవ్లీ కపుల్. ఇప్పుడు ఈ ఇద్దరికీ నెటిజన్స్ విషెస్ తెలుపుతున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: