టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన “మురారి” సినిమా మహేష్ బాబు పుట్టినరోజు కానుకగా రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. 2001లో విడుదలైన ఈ చిత్రం తన వినూత్న కథాంశం, నటీనటుల ప్రతిభతో ప్రేక్షకులను మెప్పించింది. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు సరసన సోనాలి బింద్రే హిరోయిన్ గానటించింది. అంతే కాకుండా ఇందులో సుకుమారి, కైకాల సత్యనారాయణ, గొల్లపూడి మరుతీరావు లక్ష్మి, రఘుబాబు, రవిబాబు ముఖ్యపాత్రల్లో నటించారు. ఇకపోతే ఈ సినిమాకి మణి శర్మ సంగీతం అందించగా ఆయన అందించిన పాటలు ఇప్పటికీ సూపర్ హిట్స్ గా

 నిలుచున్నాయి. సినిమా రీ రిలీజ్ అవుతుందనే వార్త తెలిసినప్పటి నుండి ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. కాగా ఈ సినిమా బుకింగ్స్ రీసెంట్ గా స్టార్ట్ కాగా దీనికి అదిరే రెస్పాన్స్ వస్తుంది. ఓపెన్ చేసిన మొదటి రోజే 40 లక్షల కి పైగా వసూళ్లు కేవలం బుకింగ్స్ తోనే వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనితో ఇలాంటి క్లాస్ సినిమాకి కూడా మాస్ బుకింగ్స్ ని చూపించడం మహేష్ బాబుకే సాధ్యం అయ్యింది అని చెప్పాలి. టికెట్ బుకింగ్స్ ప్రారంభమైన క్షణం నుండి థియేటర్లు నిండుకున్నాయి. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాను మరోసారి వెండి తెరపై చూడాలనే ఆత్రుతతో ఉన్నారు. సినిమా విడుదలైనప్పుడు చూసిన

 వారు తమ పిల్లలతో కలిసి మరోసారి ఈ సినిమాను ఆస్వాదించేందుకు ప్లాన్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి చాలా చర్చ జరుగుతోంది. మురారి సినిమా రీ రిలీజ్ అవ్వడం చాలా మంచి నిర్ణయం అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి క్లాసిక్ సినిమాలను మళ్లీ తెరపై చూడటం వల్ల కొత్త తరం ప్రేక్షకులకు కూడా మంచి అవకాశం లభిస్తుంది. మురారి సినిమా రీ రిలీజ్ సక్సెస్ అవ్వడంతో ఇలాంటి మరిన్ని సినిమాలు రీ రిలీజ్ చేయాలనే కోరిక ప్రేక్షకుల్లో పెరుగుతోంది. చిత్రబృందం ఈ స్పందనను దృష్టిలో పెట్టుకుని మరింత మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: