కొన్ని రోజుల క్రితం మలయాళ ఇండస్ట్రీలో మంజుమల్ బాయ్స్ అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. పెద్దగా అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదల అయిన ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మలయాళ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమాకు మలయాళ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిసింది. చివరగా ఈ సినిమా అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇలా మలయాళం లో మొదట విడుదల అద్భుతమైన విజయం అందుకున్న ఈ సినిమాను ఆ తర్వాత తెలుగు లో కూడా విడుదల చేశారు.

ఇక అప్పటికే మలయాళం లో అద్భుతమైన విజయం సాధించిన సినిమా కావడంతో ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ ఈ సినిమా తెలుగులో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో కూడా ఫుల్ గా సక్సెస్ అయింది. దానితో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అద్భుతమైన కలెక్షన్లు వచ్చాయి. ఇకపోతే ఈ సినిమాలో గుణ మూవీలోని ఇళయరాజా సంగీతం అందించిన కన్మణి అనే సాంగ్ ను వాడారు.

ఇళయరాజా నా అనుమతి లేకుండా ఆ సినిమాలో ఆ పాటను వాడారు అనే లీగల్ నోటీసులు మూవీ బృందానికి పంపారు. ఇకపోతే ఈయన నా అనుమతి లేకుండా సినిమాలో ఆ పాటను వాడినందుకు రెండు కోట్ల రూపాయలను నష్టపరిహారంగా ఇవ్వాలి అని మూవీ యూనిట్ ను కోరినట్లు , ఇక వారు కూడా ఇళయరాజా తో అనేక సంప్రదింపులు జరిపినట్లు , దానితో రెండు కోట్లు కాకుండా 60 లక్షలకు డీల్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. అలా మంజుమల్ బాయ్స్ సినిమాలో కమ్మని పాటను వాడినందుకు ఈ మూవీ నిర్మాతలు ఇళయరాజాకు 60 లక్షలు ఇవ్వడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

mb