రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా కల్కి 2898 AD అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని దిశా పటాని హీరోయిన్ గా నటించగా ... అమితా బచ్చన్ , దీపికా పదుకొనే ఈ సినిమాలో అత్యంత కీలకమైన పాత్రలలో నటించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను వైజయంతి మూవీస్ , స్వప్న సినిమాస్ బ్యానర్ పై అశ్విని దత్ కూతురు స్వప్న దత్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఈ సినిమాలో కమల్ హాసన్ విలన్ పాత్రలో నటించాడు.

జూన్ 27 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన ఈ సినిమా ఇప్పటికే 1000 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం కూడా ఈ సినిమాకు డీసెంట్ కలెక్షన్ లు ప్రపంచ వ్యాప్తంగా లభిస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించిన కమల్ హాసన్ కు కూడా మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే నాగ్ అశ్విన్ మొదట ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం కమల్ హాసన్ ను సంప్రదించగా ఆయన ఆ సమయంలో ఇండియన్ 2 మూవీ తో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా చేయలేను అని చెప్పాడట.

దానితో నాగ్ అశ్విన్ మోహన్ లాల్ దగ్గరకు ఈ పాత్ర కోసం వెళ్లగా ఆయన కూడా ఈ పాత్ర చేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదట. ఇక అంతలోనే ఇండియన్ 2 కు సంబంధించిన పనులు చాలా వరకు పూర్తి కావడంతో కమల్ హాసన్ స్వయంగా ఆ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తాను అని అన్నాడట. దానితో నాగ్ అశ్విన్ మళ్లీ కమల్ హాసన్ తోనే కల్కి సినిమాలో విలన్ పాత్రను చేయించాడు. ఇలా మోహన్ లాల్ "కల్కి" సినిమాలో విలన్ పాత్ర అవకాశాన్ని మిస్ చేసుకున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ml