మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన బింబిసార మూవీ దర్శకుడు అయినటువంటి మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే సోషియో ఫాంటసీ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి త్రిష , చిరుకు జోడిగా నటిస్తూ ఉండగా ... యూ వీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రమోద్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

ఇకపోతే ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు  మూవీ యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఓ వైపు ఈ సినిమా షూటింగ్ ను తెరకెక్కిస్తూనే మరో వైపు ఈ మూవీ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ఈ మూవీ బృందం పూర్తి చేస్తూ వస్తుంది. ముందు చెప్పినట్లుగా ఈ మూవీ ని జనవరి 10 వ తేదీన విడుదల చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లను ఈ మూవీ యూనిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ సినిమాపై ఈ మూవీ దర్శకుడు మల్లాడి వశిష్ట అదిరిపోయి రేంజ్ కాన్ఫిడెన్స్ గా ఉన్నట్లు తెలుస్తోంది. చిరంజీవి కెరీర్ లోనే ఈ సినిమా టాప్ 3 లో ఉండే అవకాశాలు ఉన్నట్లు ఆయన అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక చిరంజీవి కెరీయర్ లోనే టాప్ 3 లో ఉండే రేంజ్ లో ఈ మూవీ ఉండబోతుంది అంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అని మెగా ఫ్యాన్స్ ఇప్పటి నుండే ఫిక్స్ అయ్యారు. మరి నిజం గానే ఈ సినిమా చిరు కెరియర్ లో టాప్ 3 లో ఉండే రేంజ్ లో ఉంటే మాత్రం దాని కలెక్షన్లను ఆపడం చాలా కష్టం. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ... ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: