తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి నాగార్జున గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నాగర్జున ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా నా సామి రంగ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఇకపోతే నాగార్జున "నా సామి రంగ" సినిమాను సంక్రాంతి కి కేవలం మూడు , నాలుగు నెలల ముందే మొదలు పెట్టి ఆ సినిమాను సంక్రాంతి కి విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు. 

కానీ మరి మూడు , నాలుగు నెలల్లో సినిమా పూర్తి అవుతుందా ..? సంక్రాంతి కి విడుదల అవుతుందా అని నాగార్జున అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకులు కూడా భావించారు. కాకపోతే ఈ సినిమా దర్శకుడు విజయ్ బిన్నీ మాత్రం పక్కా ప్లానింగ్ తో ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి సంక్రాంతి కి చెప్పిన విధంగానే తీసుకువచ్చాడు. ఇకపోతే నాగార్జున ఇప్పటి వరకు ఏ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

ఈ సారి కూడా నాగార్జున "నా సామి రంగ" సినిమా లాగానే మూడు , నాలుగు నెలల ముందు సినిమాను స్టార్ట్ చేసి మళ్లీ సంక్రాంతి కి మూవీ తీసుకువస్తాడు అని చాలా వార్తలు వచ్చాయి. దానితో నాగర్జున అభిమానులు కూడా ఫుల్ ఖుషి అయ్యారు. కానీ ఈ సారి పరిస్థితులు అలా కనబడడం లేదు. ఇప్పటికే నాగార్జున "బిగ్ బాస్" కి సిగ్నల్ ఇచ్చాడు. ఇంకా ఏ మూవీ ని ఓకే చేయలేదు. దానితో ఈ సారి నాగార్జున సంక్రాంతి కి రావడం దాదాపు కష్టమే అని తెలుస్తుంది. ఇలా నాగార్జున ఈ సారి సంక్రాంతి కి రావడం కష్టమే అని తెలియడంతో నాగార్జున అభిమానులు ఫుల్ గా డిసప్పాయింట్ అవుతున్నట్లు తెలుస్తుంది.





మరింత సమాచారం తెలుసుకోండి: