డైరెక్టర్ రాజమౌళి, రమాకు రెండవ భర్త అన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. రమా కి వివాహమయి కార్తికేయ పుట్టిన తర్వాత ఆమె విడాకులు తీసుకోవడంతో ఆ తర్వాత రాజమౌళిని ప్రేమించి మరి వివాహం చేసుకున్నది. తాజాగా రాజమౌళి మోడ్రన్ మాస్టర్ అనే ఒక డాక్యుమెంటరీ తీయగా ఇందులో రాజమౌళి, రమా ప్రేమ పెళ్లి గురించి పలు విషయాలను తెలియజేశారు. అలాగే కొడుకు కార్తికేయ గురించి కూడా మాట్లాడడం జరిగింది..



రమా మాట్లాడుతూ.. రాజమౌళి మొదటిసారి తమ అక్క పెళ్లిలో చూసానని.. తనకి మాత్రం రాజమౌళి పెద్దగా స్పెషల్ గా అనిపించలేదని కేవలం తమ బావగారికి తమ్ముడు మాత్రమే అవుతాడని తెలిపింది. రాజమౌళినే మొదటిసారి తనకు ప్రపోజ్ చేశారని తాను నో చెప్పానని కానీ అప్పటికి విడాకులు అయి ఒక కొడుకు ఉన్నాడు అనే విషయాన్ని కూడా తెలిపానని అయినా కూడా రాజమౌళి తనని వదలలేదని ఒక ఏడాది పాటు పట్టుదలగా తనను ప్రేమిస్తున్నానని చెబుతూనే ఉన్నారు. దీంతో ఏడాది తర్వాత ఇద్దరం కలిసి జీవించాలనుకున్నామంటూ తెలిపింది రమా.


ఇక రమా రాజమౌళి  కుమారుడు కార్తికేయ మాట్లాడుతూ.. ఆయన నాకు తండ్రి కాకముందే ఒక అంకుల్ గా బాగా మంచి పరిచయం చిన్న వయసు నుంచే తనను తన ఫ్యామిలీ కజిన్స్ పిల్లల్ని ఎక్కువగా బయటకు తీసుకువెళ్లే వారిని తెలియజేశారు. రాజమౌళి లాంటి తండ్రి తనకి దక్కడం ఒక గొప్ప వరమని తెలియజేశారు. ఇప్పటికీ తమకు ఎలాంటి ఇబ్బంది లేదని.. కేవలం ఎవరైనా సరే స్వతగానే పైకి రావాలని కోరుకునే మనస్తత్వం తన తండ్రికి ఉందని కార్తికేయ తెలియజేశారు.. తాను చేసే హార్డ్ వర్క్ మరెవరు కూడా చేయలేరని తెలిపారు కార్తికేయ.. ప్రస్తుతం రమా, రాజమౌళి  ప్రేమ పెళ్లి విషయం పైన ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: