పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే సినీ పరిశ్రమలో చాలా మంది ఇష్టపడే వ్యక్తి. అభిమానులు ఏ రేంజ్ లో ఇష్టపడతారో అలాగే సినీ ప్రముఖులు కూడా చాలా వరకు పవర్ స్టార్ ని అదే రేంజ్ లో లైక్ చేస్తుంటారు. ఇక అలీ, పవన్ కళ్యాణ్ ఎంత మంచి మిత్రులొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే రాజకీయాల కారణంగా వీరి మధ్య గ్యాప్ వచ్చింది.ఈ నేపథ్యంలో ఈ నెల 15న 'డబుల్ ఇస్మార్ట్' విడుదలకు సిద్ధమైంది. పూరి స్టైల్ లో సాగే మాస్ మసాలా సినిమా ఇదని ప్రచార చిత్రాలు చెప్పకనే చెబుతున్నాయి. రామ్ ఎనర్జీ ఈ ట్రైలర్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.అలీ గెటప్ కొత్తగా కనిపిస్తోంది. పూరి సినిమాల్లో అలీ కామెడీ ట్రాకులకు మంచి పేరొచ్చింది. కొన్ని సార్లు కథతో సంబంధం లేకపోయినా, ఆ ట్రాకులు భలే నవ్వించాయి. 'డబుల్ ఇస్మార్ట్`లోనూ తన ట్రాక్ బాగా పేలిందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ట్రాక్ ఆలోచన ముందు లేదట. సినిమా అంతా పూర్తయిన తరవాత అలీ ఉండుంటే బాగుంటుందని భావించిన పూరి, అప్పటి కప్పుడు ఈ ట్రాక్ రాసుకొన్నాడని తెలుస్తోంది. పూరి ఇది వరకు కూడా ఇలానే చేశాడు. 'దేశముదురు' స్క్రిప్టులో అలీ లేడు. చివర్లో తన పాత్రని యాడ్ చేయాల్సివచ్చింది. కానీ ఆ పాత్రకు మంచి పేరొచ్చింది. ఇప్పుడూ అలానే జరుగుతుందన్నది టీమ్ నమ్మకం.విభిన్నమైన కథతో వచ్చిన ఇస్మార్ట్‌ శంకర్‌ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్‌గా 'డబుల్‌ ఇస్మార్ట్‌' తెరకెక్కింది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్‌ విడుదలైంది. ఈ ట్రైలర్‌లో అలీ ప్రత్యేక పాత్రలో కనిపించారు. చూడడానికి కోతి రూపంలో అలీ ప్రత్యేక పాత్రలో ఉన్నారు. ఆ పాత్రలో అలీ అచ్చం కోతిలా నటించాడు.ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తో కలిసి మళ్ళీ సినిమా ఎప్పుడు చేస్తారు? అంటూ డబుల్ ఇస్మార్ట్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు అలి ని అభిమాని ప్రశ్నించారు. పిఠాపురం తాలూకాలో ఎప్పుడు చేరుతారు సినిమాల్లో పవన్ తో కలిసి మిమ్మల్ని చూడాలని ఎదురుచూస్తున్నామని ఫ్యాన్స్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన ఆలీ ఓకే ఓకే అన్నట్లుగా సై గా చేశారు.ఈ నేపథ్యంలో 'డబుల్ ఇస్మార్ట్' లో అలీని ఓ గ్రహంతర వాసిలా చూపించబోతున్నారని, తన మాటలు, చేష్టలు నవ్విస్తాయని పూరి సన్నిహితులు చెబుతున్నారు. ఈ ట్రాక్ కీ కథకూ సంబంధం ఉండదు. కానీ.. మాంచి యాక్షన్ మూడ్ లో సాగిపోతున్న సినిమాకు అలీ కాస్త ఉపశమనం కలిగిస్తాడని, థియేటర్ మూడ్ ని మారుస్తాడని చెబుతున్నారు. ఈమధ్య పెద్ద సినిమాల్లో అలీకి సరైన పాత్రలు పడడం లేదు. చిన్న సినిమాలకు ఆయన్ని ఎలా వాడుకోవాలో తెలియడం లేదు. అలీ కూడా ఆద్యంతం నవ్వించి చాలా కాలమైంది. ఆ లోటు 'డబుల్ ఇస్మార్ట్' తీరుస్తాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: