రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రభాస్ ఇప్పటికే ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించి ఇండియా వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. తాజాగా ప్రభాస్ , నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD అనే పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించాడు. జూన్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఈ సినిమా ఇప్పటికే 1000 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టి అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ , మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

మూవీ షూటింగ్ పూర్తి కాక ముందే ప్రభాస్ హను రాగవపూడి దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు. ఇప్పటికే హను రాగవపూడి , ప్రభాస్ మూవీ కి సంబంధించిన దాదాపు అన్ని పనులను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే హను రాఘవపూడి ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా మృణాల్ ఠాగూర్ ని హీరోయిన్ గా కూడా ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక మృణాల్ ఠాకూర్ , ప్రభాస్ లాంటి అద్భుతమైన స్టార్ హీరో సినిమా కావడంతో తన రెమ్యూనరేషన్ ను డబల్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఈ ముద్దుగుమ్మ సినిమాకు 3 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోక , ప్రభాస్ సినిమా కోసం 6 కోట్లు డిమాండ్ చేసినట్లు , ఈ ముద్దుగుమ్మకు అద్భుతమైన క్రేజ్ ఉండడంతో మూవీ మేకర్స్ కూడా ఆ మొత్తం ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. ఈ మూవీ కనుక మంచి విజయం అందుకుంటే మృణాల్ క్రేజ్ ఇండియా వ్యాప్తంగా భారీగా పెరిగే అవకాశం చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: