టాలీవుడ్ యువ నటుడు రామ్ పోతినేని తాజాగా డబల్ ఇస్మార్ట్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. కావ్య దాపర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... డేరింగ్ అండ్ డాష్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను ఆగస్టు 15 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇకపోతే ఇదే తేదీన మాస్ మహారాజా రవితేజ హీరోగా భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన మిస్టర్ బచ్చన్ మూవీ కూడా విడుదల కాబోతోంది.

ఇది ఇలా ఉంటే ఈ రెండు సినిమాలకు అదిరిపోయే రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు , అలాగే ఈ రెండు మూవీలకు సూపర్ సాలిడ్ బిజినెస్ ఓ టి టి , శాటిలైట్స్ , మ్యూజిక్ హక్కులు  ద్వారా దక్కినట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే ఈ రెండు సినిమాలకు అన్ని హక్కులతో కలిపి దాదాపు 100 కోట్ల దగ్గర బిజినెస్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రెండు సినిమాల విడుదల తేదీలు కూడా దగ్గర పడ్డాయి. దానితో ఇప్పటికే ఈ మూవీ యూనిట్స్ ఈ సినిమాల నుండి వరుసగా ప్రచార చిత్రాలను విడుదల చేస్తూ వస్తున్నాయి.

అందులో భాగంగా ఇప్పటికే ఈ రెండు మూవీ బృందాలు ఈ సినిమాల నుండి కొన్ని పాటలను విడుదల చేయగా వాటికి మాత్రం ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఈ సినిమాలకు జరిగిన బిజినెస్ స్థాయిలో మాత్రం ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఈ మూవీలపై అంచనాలు కనబడడం లేదు. కాకపోతే ఈ మూవీలకు హిట్ టాక్ వస్తే మాత్రం అదిరిపోయే రేంజ్ కలెక్షన్లు వచ్చే అవకాశం చాలా వరకు ఉంది. మరి ఈ రెండు మూవీ లకు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి టాక్ వస్తుందో ... ఏ రేంజ్ కలెక్షన్లు దక్కుతాయో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: