టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంత మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేని కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తన నటన, అందంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది సమంత. హెల్త్ విషయంలో సమంత ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆరోగ్యంగా ఉండేందుకు జిమ్ లో ఎక్సర్సైజ్ లు, వ్యాయామాలు వంటి ఎన్నో కసరత్తులు చేస్తూ ఉంటుంది. సమంత స్కిన్ పరంగా కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది.


అందంగా ఉండేందుకు, హెల్తీ స్కిన్ కోసం విపరీతంగా ఆరాటపడుతోంది. సమంత చాలా వరకు మేకప్ వేసుకోదు. మేకప్ చాలా తక్కువగా వేసుకొని సహజంగా కనిపించేలా ఉంటుంది. సమంత నేచురల్ గా ఉండేందుకు కొన్ని రకాల స్కిన్ ప్రొడక్ట్స్ నీ వాడుతుందట. క్లెన్సింగ్ వేసుకోవడం వల్ల స్కిన్ మీద దుమ్ము, ధూళిని వదిలిస్తుంది. దానివల్ల చర్మం మెరుస్తోంది. టోనింగ్, మాయిశ్చరైజింగ్ నీ సమంత ప్రతి రోజు వేసుకుంటుంది. సమంత బయటికి వెళ్లే ముందు సన్ స్క్రీన్ తప్పకుండా అప్లై చేసుకుంటుంది. ఇది స్కిన్ కి చాలా బాగా పనిచేస్తుంది.


ఇక స్కిన్ ఎప్పుడూ తాజాగా, కాంతివంతంగా ఉండేందుకు తాజా పండ్లు, కూరగాయలు తింటూ ఉంటుంది. స్కిన్ అందంగా ఉండడానికి విటమిన్ సి ఎంతో అవసరం. అందువల్ల సమంత తీసుకునే ప్రతి ఆహారంలో విటమిన్ సి ఉండేలా చూసుకుంటుంది. ఇక రాత్రి సమయంలో నిద్రించే ముందు ఎలాంటి మేకప్ లేకుండా.... మేకప్ ఉంటే రిమూవ్ చేసి పడుకుంటుందట. స్కిన్ ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉండేందుకు వాటర్ తరచుగా తాగుతూ ఉంటుందట. అందువల్లనే సమంత చాలా నేచురల్ గా ఉంటుంది. తన చర్మం ఎప్పుడు కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది. కాగా, 2021 డిసెంబర్‌ మాసంలో అక్కినేని నాగ చైతన్యకు విడాకులు ఇచ్చిన సమంత.. అప్పటి నుంచి ఒంటరి జీవితాన్ని గడుపుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: