ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన విక్రమ్ ఫస్ట్ లుక్ అండ్ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది . ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ కానుంది . ఇక ఈ క్రమంలో నిన్న హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు . ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖ యాంకర్ సుమ యాంకర్ గా వ్యవహరించింది . ఇక ఈ సందర్భంగా సుమ పలువురి నటీనటులను వేదిక పైకి పిలిచి సరదాగా ఆటపట్టించింది . ఈ క్రమంలోనే నటుడు డానియల్ను స్టేజ్ పైకి పిలిచి మాట్లాడింది . తెలుగులో డానియల్ తో .. " ఈ మూవీని తప్పకుండా అందరూ చూడండి .
అలాగే ఇక్కడ అందరిలో సుమని చాలా అందంగా ఉంది " అని కామెడీగా మాట్లాడించింది . ఇక ఆ తర్వాత సుమాకు థాంక్యూ చెబుతూ వేదిక పైనే షాక్ ఇచ్చాడు . థాంక్యూ సుమ అంటూ వెంటనే ఆమె హ్యాండ్కు కిస్ పెట్టాడు . దీంతో సుమ ఒక్కసారిగా షాక్ అయింది . అనంతరం రాజా డానియల్ మా అన్నయ్య అని చెబుతుంది . త్వరలోనే రాకి పండగ వస్తుందని .. అన్నయ్య సన్నిధి అంటూ సాంగ్ పాడి సరదాగా తీసుకుంది . ప్రజెంట్ ఎందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .