మావ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ప్రణీత సుభాష్ . ఈ బ్యూటీ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు . జూనియర్ ఎన్టీఆర్ తో రభస అండ్ పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది వంటి చిత్రాలు చేసి ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది . బాపు బొమ్మగా తెలుగు ప్రేక్షకులను మైమరిపించింది కూడా . కెరీర్ లో ఎదిగే సమయంలోనే ఈ బ్యూటీ వ్యాపారవేత్త అయిన నితిన్ రాజునూ వివాహం చేసుకుంది .


ఇక ఈ దంపతులకు 2022లో ఆడబిడ్డ జన్మించింది కూడా . ప్రస్తుతం ప్రణీత అమ్మగా రెండోసారి ప్రమోషన్ పొందడానికి సిద్ధంగా ఉంది . రీసెంట్ గానే ఈ గుడ్ న్యూస్ను అభిమానులతో పంచుకుంది ఈ భామ . బేబీ బంప్ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసి .. " రౌండ్ టు ఇక నుంచి ప్యాంట్లు సరిపోవు " అంటూ రాసుకు వచ్చింది . ఇక తాజాగా ఈ అమ్మడు నెట్టుంటా ప్రెగ్నెన్సీ సమయంలో మానసిక పరిస్థితి గురించి మరో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది . " నిద్రలేని రాత్తులు అండ్ హార్మోన్లలో మార్పులు , పెల్విక్ పెయిన్ , యాసిడ్ రిఫ్లక్స్ , సి సెక్షన్ కోసం రెడీ అవుతున్నాను .


ఈ సమయంలో అత్యంత విలువైన వాళ్ళు నా పక్కన ఉన్నారు " అంటూ నటి ప్రణీత సుభాష్ తన భర్త నితిన్ రాజుతో ఉన్న ఓ పిక్ ను జోడించి ఈ పోస్ట్ ను పెట్టింది . ప్రెసెంట్ ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది . ఈ పోస్ట్ ని చూసిన పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు . ప్రస్తుతం ప్రణీత ఎటువంటి సినిమాల్లోనూ నటించడం లేదు ‌. ఇటీవల ఢీ అనే డాన్స్ ప్రోగ్రాం కి చేర్చిగా వ్యవహరించింది . ఇక ఆ సీజన్ ముగియడంతో తదుపరి సీజన్ కు తాను ప్రెగ్నెంట్ కావడంతో జడ్జ్ గా వ్యవహరించలేకపోయింది .

మరింత సమాచారం తెలుసుకోండి: