1990వ దశకంలో ఎక్కువగా చాలామంది కుటుంబ కథ చిత్రాలతోనే ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. బాలీవుడ్ లో ఆల్ టైం బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన చిత్రం హమ్ ఆప్కే హై కౌన్. ఈ సినిమా ఇతర భాషల ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది.. తెలుగులో ఈ చిత్రాన్ని ప్రేమాలయం అని పేరుతో విడుదల చేశారు. అయితే వరుస ప్లాపులతో ఉన్న సల్మాన్ ఖాన్ కెరియర్ కు ఈ సినిమా కాస్త ఊరటనిచ్చింది
అంతేకాకుండా స్టార్ హీరో స్టేటస్ని సైతం తెచ్చి పెట్టిందని చెప్పవచ్చు.


సూరత్ భరద్వాజ్ డైరెక్షన్ వహించగా రామ్ లక్ష్మణ్ పాటలు పాడగా రాజశ్రీ ప్రొడక్షన్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్టు 5- 1994లో విడుదలైన ఈ సినిమా నేటితో 30 ఏళ్లు పూర్తి చేసుకున్నది. తెలుగులో విడుదలైన కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుందట. ఈ సందర్భంగా ప్రేమాలయం గురించి కొన్ని తెలియని విషయాలను గురించి ఇప్పుడు చూద్దాం.


1). ఈ చిత్రంలో మొదట హీరోగా అమీర్ ఖాన్ ని అనుకున్నారట .అయితే స్క్రిప్ట్ అంతా బాగలేదని అమీర్ ఖాన్ చెప్పడంతో సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో నటించారు


మొట్టమొదటిసారిగా సల్మాన్ ఖాన్ 100 రోజులు ఆడిన చిత్రంగా ఈ సినిమా నిలిచింది.అంతేకాకుండా 1990లో అత్యధికంగా కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా కూడాపేరు సంపాదించింది.



ఫుల్ రన్ టైంలో 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ సాధించిన మొట్టమొదటి హిందీ చిత్రంగా పేరు సంపాదించింది.


ఈ చిత్రానికి ఏకంగా ఐదు ఫిలింఫేర్ అవార్డులు వచ్చాయి అలాగే జాతీయ బహుమతి కూడా అందుకున్నది.


ముఖ్యంగా ఇందులో ఉన్న సాంగ్ "అక్క నీ మరిదేంతో వెర్రోడు" అనే పాటకు మాధురి దీక్షిత్ ధరించిన దుస్తులు చాలా హైలైట్ గా నిలిచాయి. ఈ సినిమాతో విదేశాలలో కూడా మాధురి దీక్షిత్ చీర కట్టుకు మంచి క్రేజ్ ఏర్పడింది.

ఈ చిత్రాన్ని ప్రముఖ చిత్రకారుడు ఎం.ఎఫ్ హుస్సేన్ 85 సార్లు చూసినట్లు తెలియజేశారు.


సల్మాన్ ఖాన్ కంటే ఎక్కువగా మాధురి దీక్షిత్ ఈ సినిమాకి రెమ్యూనరేషన్ తీసుకుందట.

అప్పట్లో 7.4 కోట్ల రూపాయల టికెట్లు అమ్మిన రికార్డు ఈ సినిమాకి ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: