ఇండియన్ సినిమా దగ్గర నెక్స్ట్ లెవెల్ అవుట్ పుట్ తో సాలిడ్ కంటెంట్ ని అందిస్తున్న సినీ ఇండస్ట్రీస్ లో ఇప్పుడు మన తెలుగు సినిమా తప్పకుండా ముందు వరుసలో ఉంటుంది. అలాగే బాలీవుడ్ సినిమా సెట్ చేసిన స్టాండర్డ్స్ ని దాటి మనం ఇప్పుడు ప్రపంచ సినిమా దగ్గర షైన్ అవుతున్నాం. కాగా మూవీ లవర్స్ ఎంతసేపు గ్రాండ్ విజువల్స్, బడ్జెట్ ఉన్న సినిమాలు మాత్రమే కాకుండా కొన్ని నాచురల్, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చూసేందుకు ఇష్టపడతారు.భారీ బడ్జెట్ సినిమాలన్నీ ఒకేసారి పాన్ ఇండియా రిలీజ్ అంటూ అన్ని భాషల్లో రిలీజ్ చేస్తుంటే కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాక డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఐతే కొన్ని ప్రత్యేకమైన సినిమాలు మాత్రం రీమేక్ అవుతున్నాయి. OTTలు వచ్చాక సినిమాలకు ఆదరణ తగ్గినా కొన్ని సినిమాలు రీమేక్ చేస్తే ఎక్కువ లాభాలు పొందవచ్చు.. ఎక్కువ మంది ప్రేక్షకులకు సినిమా అందించవచ్చు. ఈ కావలసిన మలయాళం నుంచి ఈమధ్యనే రిలీజై సూపర్ అయిన ఆవేశం సినిమా కూడా హిట్ చర్చలు జరుగుతున్నాయి.అలా పెద్దగా బడ్జెట్ ఏమి లేకుండా సింపుల్ సినిమాలు అందించడంలో అయితే మలయాళ ఇండస్ట్రీకి మంచి పేరుంది. కానీ మలయాళ సినిమా బాక్సాఫీస్ మాత్రం మిగతా భాషలతో పోలిస్తే కంటెంట్ బాగున్నప్పటికీ ఇప్పుడిప్పుడే బాక్సాఫీస్ దగ్గర భారీ నంబర్స్ నమోదు చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇలా ఈ ఏడాదిలో వరుస 100, 200 కోట్ల సినిమాలు వచ్చి అదరగొట్టాయి.ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే చూస్తే ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్ ఇంకా ఆడు జీవితం గోట్ లైఫ్ చిత్రాలు వచ్చి భారీ వసూళ్లతో అదరగొట్టాయి. ఇక ఈ చిత్రాలతో పాటుగా తెలుగులో డబ్బింగ్ కాని మరో సినిమా కూడా ఉంది. మరి ఆ సినిమానే "ఆవేశం". మలయాళ వెర్సటైల్ నటుడు, మన పుష్ప సినిమాలో భన్వర్ సింగ్ షెకావత్ అయినటువంటి ఫహద్ ఫాజిల్ నటించిన సినిమానే ఈ ఆవేశం. మరి ఈ చిత్రం కూడా అక్కడ భారీ వసూళ్లు అందుకొని అదరగొట్టింది. మరి ఈ సినిమా తర్వాత ఓటిటిలో కూడా వచ్చేసింది. మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రం ఇపుడు ప్రైమ్ వీడియో, హాట్ స్టార్ లలో స్ట్రీమింగ్ అవుతుండగా తెలుగులో మాత్రం ఇంకా రాలేదు.. మరి ఇన్ని నెలలు అయినా ఈ సినిమా తెలుగులో స్ట్రీమింగ్ కి ఎందుకు రాలేదో ఇప్పుడు క్లారిటీ వినిపిస్తుంది.ఐతే ఆవేశం
థియేటర్ లో
బ్లాక్ బస్టర్ కాగా ఆ
సినిమా ఓటీటీలో కూడా ఆదరించారు. ఐతే ఆవేశం
సినిమా చూసిన తెలుగు మేకర్స్ ఇది తెలుగులో డబ్ చేయడం
కన్నా రీమేక్ చేస్తే బాగుంటుందని అనుకున్నారు.మైత్రి
మూవీ మేకర్స్ ఆవేశం
రీమేక్ ప్రయత్నాలు చేస్తుంది. ఐతే
డైరెక్టర్ ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదు కానీ ఆవేశం సినిమాలో బాలకృష్ణని నటింప చేయాలని చూస్తున్నారు.
బాలయ్య ఇమేజ్ కి ఆవేశం పర్ఫెక్ట్ గా ఉంటుందని అంటున్నారు. ఆవేశం
సినిమా లో ఫాహద్ ఫాజిల్ రోల్ అదరగొట్టేసింది. ఆ పాత్రను తెలుగులో
బాలకృష్ణ చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.సినిమాను
రీమేక్ చేయాలని చూస్తున్న మైత్రి నిర్మాతలు బాలయ్యను కాకా పడుతున్నారని తెలుస్తుంది.
బాలకృష్ణ ఓకే అంటే చాలు వెంటనే పనులు మొదలు పెట్టాలని చూస్తున్నారు.
బాలయ్య ప్రస్తుతం కె.ఎస్
బాబీ డైరెక్షన్ లో
సినిమా చేస్తున్నాడు. ఆ
సినిమా పూర్తి చేయడమే ఆలస్యం అఖండ 2 ని సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నాడు.
బాలకృష్ణ ఆవేశం చేస్తే మాత్రం నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ ప్రేక్షకుడు కూడా సినిమాను సూపర్ గా ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు. ఇంతకీ ఆవేశం
రీమేక్ పై
బాలకృష్ణ ఒపీనియన్ ఏంటి ఒకవేళ
బాలయ్య కాదంటే మరో హీరోతో ఆ
సినిమా చేస్తారా లేదా అన్న విషయంపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది.