పూరీ జగన్నాథ్ రామ్ ల కాంబినేషన్ లో ‘ఇస్మార్ట్ శంకర్’ కు సీక్వెల్ గా రూపొందిన ‘డబల్ ఇస్మార్ట్’ ఈనెల ఆగష్టు 15న విడుదల కాబోతోంది. ఈ సినిమా పై ఇప్పటి వరకు పెద్దగా అంచనాలు ప్రేక్షకులలో లేకపోవడం ఈ మూవీ బయ్యర్లను కలవర పెడుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.



దీనికితోడు ఈ సినిమాకు ముందు పూరీ దర్శకత్వం వహించిన ‘లైగర్’ నష్టాల తలనొప్పులు ‘డబల్ ఇస్మార్ట్’ ను వెంటాడుతున్నాయి అంటూ మరికొన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘లైగర్’ వల్ల ఘోరంగా నష్టపోయిన బయ్యర్లను ఆదుకుంటామని పూరీ గతంలో ఆసినిమా బియ్యర్లకు ఇచ్చిన మాట ఇప్పుడు పూరీని వెంటాడుతున్నాయా అన్న గాసిప్పులు కూడ వినిపిస్తున్నాయి.



వాస్తవానికి పూరీ ‘లైగర్’ బయ్యర్ల నష్టానికి న్యాయపరంగా నష్టపరిహారం ఇవ్వవలసిన బాధ్యత లేకపోయినప్పటికీ గతంలో అతడు ‘లైగర్’ బయ్యర్లకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండమని కొందరు పూరీ పై ఒత్తిడి చేస్తున్నట్లు టాక్. ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ‘డబల్ ఇస్మార్ట్’ మూవీని ఒక ప్రముఖ బయ్యర్ 60 కోట్లకు కొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.



ఇంత భారీ మొత్తం ఈ మూవీ బయ్యర్ కు రికవరీ అవ్వాలి అంటే ఈ మూవీకి కనీసం 100 కోట్ల గ్రాస్ కలక్షన్స్ వచ్చితీరాలి అన్న వార్తలు వస్తున్నాయి. అయితే ఈమూవీ ట్రైలర్ కు వచ్చిన స్పందన అంతంత మాత్రంగా ఉండటంతో ఈ మూవీ ఆశించిన ఫలితాన్ని ఎంతవరకు అందుకుంటుంది అన్న సందేహాలు మరి కొందరికి వస్తున్నాయి. అదేవిధంగా ఈ మూవీ పాటలకు కూడ స్పందన అంతంత మాత్రంగానే ఉండటం పూరీ రామ్ ల అభిమానులను కలవర పెడుతున్నట్లు టాక్. ఇది చాలదు అన్నట్లుగా ఈ మూవీని టార్గెట్ చేస్తూ హరీష్ శంకర్ రవితేజా ల ‘మిష్టర్ బచన్’ విడుదల అవుతున్న పరిస్థితులలో టోటల్ పాజిటివ్ టాక్ రాకపోతే ‘డబల్ ఇస్మార్ట్’ కు కష్టాలు తప్పవు అని మరికొందరు విశ్లేషణలు చేస్తున్నారు..



 


మరింత సమాచారం తెలుసుకోండి: