టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ నటుడిగా మంచి స్థానాన్ని ఏర్పరచుకున్న వారిలో సుధీర్ బాబు ఒకరు. ఈయన తన కెరీర్లో చాలా సినిమాలలో నటించిన అందులో చాలా తక్కువ సినిమాలే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. కాకపోతే ఈయన ప్రతి సినిమాలోను తనదైన స్థాయిలో కష్టపడుతూ ఉండడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఇతనికి మంచి గుర్తింపు ఏర్పడింది. ఇకపోతే కొంత కాలం క్రితం సుధీర్ బాబు "హరోం హర" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ విడుదలకి ముందు ఈ సినిమా బృందం ఈ మూవీ నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. 

దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంటుంది అని చాలా మంది భావించారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే నెగటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ సినిమా కూడా సుధీర్ బాబు కు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశనే మిగిల్చింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయిన ఈ సినిమా ఆ తర్వాత కొంత కాలానికే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇకపోతే థియేటర్ల వద్ద ప్రేక్షకులను నిరాశ పరచిన ఈ మూవీ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ప్లాట్ ఫామ్ లో 120 ప్లస్ మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను సాధించినట్లు అమెజాన్ సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఓ టీ టీ ప్లాట్ ఫామ్  లో మాత్రం జనాలను బాగానే ఆకట్టుకుంటున్నట్లు దీని ద్వారా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

sb