కొంత కాలం క్రితం రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా కంటే ముందు అటు రామ్ కి ఇటు పూరి జగన్నాథ్ కి ఇద్దరికీ కూడా వరుస అపజయాలు ఉన్నాయి. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ ఇద్దరు కూడా అద్భుతమైన ఫామ్ లోకి వచ్చారు.  ఈ సినిమా తర్వాత రామ్ నటించిన సినిమాలు ఏవి బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించలేదు. అలాగే పూరి జగన్నాథ్ "ఇస్మార్ట్ శంకర్" కేవలం లైగర్ సినిమాకు దర్శకత్వం వహించాడు.

మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దానితో పూరి జగన్నాథ్ , రామ్ పోతినేని హీరోగా ఈస్మార్ట్ శంకర్ మూవీ కి కొనసాగింపుగా డబల్ ఇస్మార్ట్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ సినిమాలో మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ కావ్య ధాపర్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ బృందం ఇప్పటి వరకు చాలా ప్రచార చిత్రాలను ఈ సినిమా నుండి విడుదల చేసింది.

దాదాపు అన్ని ప్రచార చిత్రాలలో కూడా ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన కావ్య దాపర్ తన అందాలను హద్దులు లేకుండా ఆరబోసినట్లు అర్థం అవుతుంది. సినిమాలో మాత్రమే కాకుండా ఈ మూవీ.కి సంబంధించిన ఈవెంట్లలో కూడా ఈ బ్యూటీ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ లను వేసుకొని వచ్చి కెమెరాలు అన్ని తన వైపు తిరిగేలా చేసుకుంటుంది. ఇలా కావ్య "డబల్ ఈస్మార్ట్" మూవీ కోసం అదిరిపోయే రేంజ్ లో అందాలను ఆరబోస్తోంది. ఈ మూవీ యూనిట్ కూడా ఈ బ్యూటీ ని , తన గ్లామర్ ను అద్భుతమైన స్థాయిలో వాడుకున్నట్లు తెలుస్తోంది. మరి కావ్య గ్లామర్ ఈ సినిమా సక్సెస్ కి ఏ స్థాయిలో ఉపయోగపడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: