జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' సినిమాలోని 'చుట్టమల్లే' పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ పాటలో జాన్వీ కపూర్ చాలా అందంగా కనిపించింది. ఆమె అందం, స్టైల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. కానీ, ఈ పాటకు సంగీతం అందించిన అనిరుధ్ రవిచందర్ గారిని చాలా మంది విమర్శిస్తున్నారు.
అనిరుధ్ రవిచందర్ 'చుట్టమల్లే' పాటను సొంతంగా కంపోజ్ చేయలేదని ఫ్యాన్స్ నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. శ్రీలంకలో చాలా ఫేమస్ అయిన 'మనికే మాగే హితే' అనే పాటని కాపీ కొట్టాడని చాలా మంది అంటున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. అనిరుధ్ ఇంతకు ముందు చేసిన పాటలతో పోలిస్తే, ఈ పాట చాలా సాధారణంగా ఉందని, అంత బాగా లేదని కొంతమంది అభిమానులు అంటున్నారు.
జాన్వీ కపూర్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య కెమిస్ట్రీ బాగా లేదని కూడా కొందరు ఫ్యాన్స్ అంటున్నారు. ఈ పాటలో ఇద్దరి మధ్య రొమాన్స్ బాగా కనిపించడం లేదని వాళ్లు చెప్తున్నారు. జాన్వీ అందంగా కనిపించినప్పటికీ, పాటపై వివాదాలు వస్తున్నాయి. అయినా, జాన్వీ అందం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది
మొత్తం మీద ‘దేవర’ సినిమాలోని కొత్త పాటలో జాన్వీ కపూర్ చాలా అందంగా కనిపించినప్పటికీ, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఈ పాట కోసం మరొకరి పాటని కాపీ కొట్టాడని చాలామంది అనుకుంటున్నారు. అందుకే ఈ పాట పై అభిమానులు, విమర్శకులు నుంచి భారీ ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
ఈ పాట రిలీజ్ అయిన తర్వాత రాజమౌళి సెంటిమెంటు నిజమవుతుందేమో అని చాలామంది అంటున్నారు. ఎందుకంటే ఈ పాట చాలా చెత్తగా ఉంది. రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఎవరైనా సరే ఫ్లాప్ అందుకోవాల్సిందే. అదే ఇప్పటిదాకా నిజమయ్యింది. ఎన్టీఆర్ దేవర సినిమా విషయంలో కూడా ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందేమో అని చాలామంది భయపడుతున్నారు ఈ పాట వారి భయాన్ని మరింత పెంచేసింది.