యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు. అందులో భాగంగానే సినిమా నుంచి ఇటీవల రొమాంటిక్ సాంగ్ ను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక మరొకవైపు హిందీలో ఎన్టీఆర్ వార్ 2 సినిమా కూడా చేస్తున్నారు. ఈ నెలలోనే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ కూడా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇదే సమయంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక యాక్షన్ సినిమాని కూడా స్టార్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతూ ఉండగా, movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ తో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎన్టీఆర్ 31 చిత్రంగా అనౌన్స్ చేసిన ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసే ఆలోచనలో పడ్డారు చిత్ర బృందం.


మరొకవైపు ప్రశాంత్ నీళ్  ప్రభాస్ తో సలార్ సినిమా చేసారు. ఆ సమయంలోనే ఎన్టీఆర్ 31వ సినిమాకు సంబంధించి కొన్ని విషయాలను ఆయన అనౌన్స్ చేశారు. సలార్ మూవీ గత ఏడాది విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. దీని తర్వాత రెండవ భాగం కూడా ప్రశాంత్ నీల్ పూర్తి చేస్తాడని అందరూ అనుకుంటున్నారు . ఈ ఏడాదిలోనే సలార్  -2  కంప్లీట్ చేసి , 2025లో ఈ సినిమాను రిలీజ్ చేస్తారని
 అభిమానులు ఆలోచిస్తున్నారు. మరి ప్రశాంత్ నీల్ ప్లానింగ్ మారిందో లేదో తెలియదు కానీ ప్రశాంత్ నీలె సలార్ మూవీ కంటే ముందుగా ఎన్టీఆర్ తో డ్రాగన్ సినిమాను తెరకెక్కించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి . ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయిందని , కాస్టింగ్ సెలక్షన్ జరుగుతోందని సమాచారం.

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉందట. ఆగస్టు నెలలో అఫీషియల్ గా లాంచ్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. హీరోయిన్ ని కూడా ఇప్పటికే ఖరారు చేశారని తెలుస్తోంది. ఇక ఫిలిం సర్కిల్లో జరుగుతున్న ప్రచారాలను బట్టి చూస్తే డ్రాగన్ సినిమా త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మరి ప్రశాంత్ నీల్ ప్లానెట్ తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: