నవీన్ పోలిశెట్టి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన నవీన్ పోలిశెట్టి ఆ తర్వాత సినిమాల్లో విలన్ గా..హీరోగా..రాణించారు.అలా ఈయన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించారు. అలాగే ఏజెంటు సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ తో హీరోగా మారారు. ఇక  ఆ తర్వాత వచ్చిన జాతి రత్నాలు సినిమా నవీన్ పోలిశెట్టికి ఎక్కడలేని క్రేజ్ తెచ్చి పెట్టింది.ఆ తర్వాత ఈయన చేసిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి కూడా ఓకే టాక్ తెచ్చుకుంది. అలా విభిన్న పాత్రలు చేస్తూ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగాలనుకుంటున్న నవీన్ పోలిశెట్టి గురించి తాజాగా ఒక వార్త మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే నవీన్ పోలిశెట్టి ఆ అమ్మాయిని రహస్యంగా పెళ్లి చేసుకొని ఈ విషయాన్ని బయట పెట్టకుండా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నారు అని తెలుస్తోంది.

అయితే గత కొద్ది రోజుల ముందు యాక్సిడెంట్ అవ్వడం వల్ల నవీన్ పోలిశెట్టికి గాయాలయ్యాయి.దాంతో చేతికి కట్టు కట్టుకొనే కొన్ని నవ్వించే వీడియోలు కూడా అభిమానులతో పంచుకున్నారు. అయితే ఈ వీడియో వైరలైన తర్వాత వెంటనే ఫిలింఫేర్ అవార్డుల్లో కనిపించాడు. దాంతో అందరూ షాక్ అయిపోయారు.ఈ విషయం పక్కన పెడితే.. యాక్సిడెంట్ అయినప్పటినుండి నవీన్ పోలిశెట్టి అమెరికాలోనే కనిపిస్తున్నాడు ముఖ్యంగా ఆయన నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా విడుదలైన సమయంలో అమెరికా వెళ్లి అక్కడే ఇన్ని రోజులుగా ఉన్నారు. అయితే అనూహ్యంగా ఈయన పెళ్లి వార్తలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

నవీన్ పోలిశెట్టి అమెరికా అమ్మాయిని సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడని,పెళ్లయి చాలా రోజులే అవుతుందని,అందుకే ఆయన అమెరికాలో ఉంటున్నారా అనే ఊహాగానాలు ఎక్కువయ్యాయి. ఇక రీసెంట్గా ఫిలింఫేర్ అవార్డ్స్ లో పాల్గొన్న నవీన్ పోలిశెట్టి మళ్లీ అమెరికాకు వెళ్లారని తెలుస్తోంది.అయితే నవీన్ పోలిశెట్టి నిజంగానే రహస్యంగా పెళ్లి చేసుకున్నారా అని మీడియా వారిని అడగగా..అలాంటిదేమీ లేదు అది కేవలం గాసిప్ మాత్రమే.నేను లైఫ్లో సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకుంటాను.పెళ్లి చేసుకునే అమ్మాయి గురించి కూడా ముందుగా మీకే చెబుతాను అని క్లారిటీ ఇచ్చారు. కానీ నవీన్ పోలిశెట్టి సీక్రెట్గా పెళ్లి చేసుకున్నాడనే న్యూస్ మాత్రం నెట్టింట్లో వైరల్ అవుతుంది

మరింత సమాచారం తెలుసుకోండి: