జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. తాజాగా దేవరా మూవీలో హీరో క్యారెక్టర్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసింది. కానీ ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని ప్రేక్షకులు బాగా ఎదురుచూస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాలా శివ కాంబినేషన్ లో రాబోతున్న 'దేవర' నుంచి ఇప్పటికే ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. దేవర ముందర నువ్వెంత అని సాగిన ఆటకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.


ఇక తాజాగా సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ రొమాంటిక్ సాంగ్లో హీరోయిన్ జాన్వి కపూర్, ఎన్టీఆర్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ జాట్ అయింది. కానీ విజువల్స్, మ్యాజిక్ విషయంలో ట్రోల్స్ తప్పలేదు. ముఖ్యంగా ఈ పాటకు సంగీతం సమకూర్చిన అనిరుధ్ కాపి పేస్ట్ చేశాడనే మిమర్శలు వచ్చాయి. ఇక కోరియోగ్రఫి విషయంలోనూ ఓ లెవెల్ లో నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు అయితే పాట లిరిల్ సోప్ యాడ్ లాగా ఉందంటూ..సాంగ్ ఎడిట్ చేసి పోస్ట్ చెయ్యగా వైరల్ అయిపోయింది.


ఇక దీనిపై స్పందిస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్..ఇలాంటి హెల్తీ ట్రోల్స్ చేసై యాక్సెప్ట్ చేస్తామని, ఎంకరేజ్ కూడా చెయ్యగలమని సపోర్ట్ చేస్తున్నారు. శృతి మించిన గలీజ్ ట్రోల్స్ మాత్రం అసలు ఒప్పుకునేది లేదని అంటున్నారు. ఇక నెటిజెన్లు..ఫ్యాన్ వార్స్ కు బదులు ఇలా ఆరోగ్యకరమైన విమర్శలు బెటర్ అని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ కోసం ప్రేక్షకులు బాగా ఎదురుచూస్తున్నారు . ఎన్టీఆర్సినిమా తీసిన గాని బ్లాక్ బస్టర్ హిట్ ఏ అవుతుంది . కానీ ఈ సినిమా మాత్రం ఏ విధంగా ఉంటుందో చూడాల్సిందే .

మరింత సమాచారం తెలుసుకోండి: