ఈ క్రమంలో నిహారిక వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటూ పలు ఆసక్తికర విషయాలు చెబుతుంది. అయితే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు కామెంట్స్ నెట్ అంట వైరల్ అవుతున్నాయి. "నేను రీసెంట్ గా ఒక కొత్త ఇంటికి మారాను. అయితే మా కజిన్స్ అందరూ నన్ను కలవడానికి వచ్చారు. చరణ్, వరుణ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ తేజ్ అందరం కలుసుకున్నాము. అయితే ఈరోజు రెండు గంటల పాటు అన్ని సినిమాల టెన్షన్ మర్చిపోయి బాగా ఎంజాయ్ చేసాము. డమ్ శరాస్ అడుకుతున్నాము. అయితే చరణ్ అన్న ఆ గేమ్ ఆడుతాడని చెప్తే ఎవరు నమ్మరు.
కానీ చరణ్ అన్నా గేమ్స్ కూడా ఆడతారు. సరదాగా గడుపుతారు. కానీ పెద్ద చీటర్. చాలా చీటింగ్ చేశాడు..గేమ్స్ లో చీటింగ్ చేసి అందరిని ఓడించి మోసం చేసి ఆయన మాత్రం గెలుస్తాడు" అని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ నిహారిక కామెంట్స్ నెట్టింట చెక్కర్లు కొడుతుండగా..ఈ విషయం తెలుసుకున్న గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ పలు రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. కాగా, కమిటీ కుర్రోళ్లు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పై శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్ పై నిర్మించాడు. దీనిని యదు వంశీ దర్శకత్వం వహించగా.. పదకొండు మంది హీరోలు, ఐదుగురు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఇందులో నటించే నటీనటులు అందరూ కొత్తవారే కావటం విశేషం.