యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో, కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ దేవర. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు మేకర్స్.మొదటి భాగం దేవర పార్ట్ 1 నుండి వచ్చిన మొదటి సింగిల్ ఫియర్ సాంగ్ అదిరిపోయింది. తాజాగా సోమవారం దేవర లోని రెండో పాటను విడుదల చేశారు. 'చుట్టమల్లె చుట్టేస్తాంది తుంటరి చూపు.. ఊరికే ఉండదు కాసేపు.. అస్తమానం నీ లోకమే నా మైమరపు.. చేతనైతే నువ్వే నన్ను ఆపు' అంటూ సాగింది ఈ పాట.కాగా సెకండ్ సింగిల్ పై మిశ్రమ స్పందంన వస్తోంది. కొందరు సాంగ్ చాలా బాగుందని చాలా సంవత్సరాల తర్వాత తారక్ రొమాంటిక్ లుక్ లో చూసాం అని, జాన్వీ కపూర్ అదరగొట్టిందని, రామజోగయ్య శాస్తి రాసిన లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయని కామెంట్స్ చేశారు. మరోవైపు సెకండ్ సింగిల్ లోని మ్యూజిక్ బాగాలేదని, హాలీవుడ్ సాంగ్ లోని మ్యూజిక్ ను యధావిధిగా కాపీ చేసాడని అనిరుధ్ పై విమర్శలు చేస్తున్నారు నెటిజెన్స్. కానీ వీటన్నిటిని దాటుకుంటూ దేవర దూసుకెళ్తున్నాడు. సాంగ్ రిలీజ్ చేసిన నాటి నుండి నం .1 స్థానంలో ట్రెండింగ్ అవుతూ 25 మిలియన్ల వ్యూస్ రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. ఇందుకు సంబంధించి అధికారకంగా పోస్టర్ రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ. త్వరలోనే ప్రమోషన్స్ స్పీడ్ పెంచే ఆలోచన చేస్తున్నారు నిర్మాతలు. సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా దసరా కానుకగా థియేటర్లలో విడుదల కానుంది దేవర.ఇప్పటికే ఈ మూవీ నుంచి ‘ఫియర్ సాంగ్’ విడుదలయ్యి మాస్ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు యూత్ కోసం రెండో పాటను విడుదల చేశారు. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ మధ్య సాగే రొమాంటిక్ సాంగ్ ఇది. ‘చుట్టుమల్లే’ పాట విడుదల అవ్వగానే చాలామంది మ్యూజిక్ లవర్స్ దీనిని విపరీతంగా ఎంజాయ్ చేశారు. కొన్ని గంటల్లోనే మిలియన్స్ వ్యూస్, లైక్స్ వచ్చాయి. కానీ కొందరు మాత్రం ఈ పాటను ఎక్కడో విన్నట్టు ఉందే అంటూ వేరే పాటతో పోలుస్తూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఈ సాంగ్ శ్రీలంక సింగర్ యోహని ఆలపించిన 'మనికే మగే హితే'ను పోలి ఉందంటున్నారు.రెండు పాటలను పోల్చి చూపిస్తూ అనిరుధ్ (మ్యూజిక్ డైరెక్టర్) దొరికిపోయాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ గీతాన్ని రామజోగయ్య శాస్త్రి రచించారు. శిల్పారావ్‌ ఆలపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: