జూనియర్‌ ఎన్టీఆర్‌  ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ దేవరతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదల చేసిన చుట్టమల్లె సాంగ్ నెట్టింటిని షేక్ చేస్తోంది. సెప్టెంబర్‌ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇదిలా ఉంటే తారక్ మరోవైపు ప్రశాంత్ నీల్‌  డైరెక్షన్‌లో ఎన్టీఆర్‌ 31 కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.ఈ సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నారు మేకర్స్. ఇందుకోసం కొత్త ఆఫీసు కూడా తీసారు మైత్రీ మూవీస్ నిర్మాతలు. ఆగస్టు 9న కొత్త ఆఫీసులో ఓపెనింగ్ వుంటుందో వేరే

 చోట వుంటుదో ఇంకా క్లారిటీ అయితే రాలేదు. కానీ ఈనెల 9న పూజా కార్యక్రమంతో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. కాగా ప్రశాంత్ నీల్ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నారు. మరీ రెగ్యులర్ షూటింగ్ ఎప్పటినుండి అనేది రానున్న రోజల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇటు దేవర, అటు బాలీవుడ్ డెబ్యూ మూవి వార్ – 2 నటిస్తున్నాడు నందమూరి హీరో. వీటిలో దేవర రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగాన్ని సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. రెండవ భాగం ప్రశాంత్ నీల్ సినిమా

 తర్వాత చేస్తాడా లేదా మధ్యలో రెండు ప్యార్లర్ గా చేస్తాడా అనేది దేవర నిర్మాతల నుండి వివరణ రావాల్సి ఉంది.కాగా ప్రశాంత్ నీల్ సలార్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడని తెలిసిందే. ప్రస్తుతానికి ఈ ప్రాంచైజీ ప్రాజెక్ట్‌ సీక్వెల్‌ సలార్‌ 2పై ఫోకస్‌ పెట్టాడని ఇన్‌సైడ్‌ టాక్‌ నడుస్తోంది. తారక్‌ కూడా దేవర, వార్‌ 2 సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ తొలిసారి జోడీ కట్టిన సినిమా దేవరలోని చుట్టమల్లే సాంగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఆగస్ట్ 5న విడుదలైన దేవర చుట్టమల్లే పాటకు అన్ని భాషల్లో కలిపి అత్యధిక వ్యూస్‌తో టాప్ 1 ట్రెండింగ్‌లో నిలిచింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: