నటసింహం నందమూరి బాలకృష్ణ తాజాగా   నటిస్తూ దర్శకుడు కొల్లి బాబీ కాంబినేషన్ లో చేస్తున్న సాలిడ్ ప్రాజెక్ట్ NBK 109 సినిమా అందరికీ తెలిసిందే. ఈ చిత్రం బాలయ్య కెరీర్ లో 109వ సినిమాగా  ప్లాన్ చేస్తుండగా ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలకృష్ణ ఇప్పటికే ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణను పూర్తి చేసుకున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ మరోసారి మాస్ యాక్షన్ హీరోగా కనిపించనున్నారు. సాలిడ్ మాస్ మూమెంట్స్ తో ఫుల్ స్వింగ్ లో ఇప్పుడు ఈ సినిమా షూటింగ్

  జరిగిపోతుంది. అయితే ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రముఖ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నట్లుగా ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్  క్లారిటీ లేనప్పటికీ కూడా ఈ బ్యూటీ తన పని తాను చేసుకుంటూ పోతుంది. కానీ తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది. అది ఏంటంటే ప్రగ్యా జైస్వాల్ కాకుండా ఈ సినిమాలో మరో యంగ్ హీరోయిన్ కూడా ఉంది అన్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనితో ఆ రెండో హీరోయిన్ గా జెర్సీ ఫేమ్ శ్రద్దా

 శ్రీనాథ్ నటిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇది కాసేపు పక్కన పెడితే ఈ మూవీలో బాలయ్యను మరోసారి మాస్ మహారాజాగా చూపించడానికి దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలు, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ 2024 చివరి నాటికి లేదా 2025 ప్రారంభంలో విడుదల కావచ్చు అని అంచనాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: