సుకుమార్ అల్లు అర్జున్ ఇద్దరు కలిసి చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ కాగా మూడేళ్ల క్రితం వచ్చిన పుష్ప 1 సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఇక మొదటి పార్ట్ సూపర్ హిట్ అవ్వడంతో సెకండ్ పార్ట్ మీద ఆటోమెటిక్ గా అంచనాలు పెరిగాయి. ఎప్పుడో ఏడాది క్రితమే పుష్ప నుంచి ఒక 2 నిమిషాల వీడియో వదిలారు మేకర్స్. ఆ తర్వాత సాంగ్స్, గ్లింప్స్ వచ్చాయి. సినిమా ఆగష్టు 15న వస్తుందని అనుకోగా అది కాస్త మిస్ అయ్యింది. ఇప్పుడు సినిమాను డిసెంబర్ 6కి రిలీజ్ లాక్ చేశారు.

ఐతే సినిమాను ఇప్పటికైనా అనుకున్న డేట్ కు తీసుకు రావాలన్న ఆలోచనతో ఉన్నారు. ఐతే ఈమధ్య పుష్ప 2 గురించి పూర్తిగా నెగిటివిటీ బాగా ఎక్కువైంది. ముఖ్యంగా కొన్ని కారణాల వల్ల మెగా ఫ్యాన్స్ అంతా రివర్స్ అయ్యారు. ఇక సినిమా వాయిదా పడటం.. మిగతా ఇష్యూస్ అన్ని కూడా సినిమా మీద కాస్త బజ్ తగ్గించేశాయి. ఐతే పుష్ప 2 నుంచి అల్లు ఫ్యాన్స్ అంతా ఇప్పుడు ఒక అదిరిపోయే అప్డేట్ ని కోరుతున్నారు.

పుష్ప 2 నుంచి నెక్స్ట్ సాంగ్ కానీ లేదా ఒక గ్లింప్స్ కానీ వదిలితే మాత్రం ఆడియన్స్ లో ఊపు వచ్చేస్తుంది. ఇప్పటికీ పుష్ప రాజ్ పాత్రపై ఆడియన్స్ ట్యూన్ అయ్యి ఉన్నా కూడా మధ్యలో గ్యాప్ రావడం వల్ల ఇబ్బందులు వచ్చాయి. అందుకే పుష్ప 2 నుంచి రిలీజ్ అయ్యే వరకు ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఉంటే మాత్రం సినిమా అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి సుకుమార్ ప్లానింగ్ ఎలా ఉందో కానీ అల్లు ఆర్మీ మాత్రం పుష్ప 2 అప్డేట్స్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 బిజినెస్ విషయంలో మాత్రం మేకర్స్ కి మంచి డీల్స్ వచ్చేలా చేస్తుందని తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: