వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటన తర్వాత అత్యంత విషాదకరమైన, భయానక కథనాలు తెరపైకి వస్తున్నాయి. ఈ విషాదం 300 మందికి పైగా ప్రాణాలను బలిగొంది. 200 మందికి పైగా ఇంకా కనిపించలేదు. వయనాడ్ జిల్లాలోని కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల నుండి ఇప్పటివరకు 215 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు, ఇందులో 87 మంది మహిళలు, 98 మంది పురుషులు, 30 మంది పిల్లలు ఉన్నారు. ఇప్పటి వరకు 148 మృతదేహాలను అప్పగించగా, 206 మంది గల్లంతయ్యారు. ఇందులో

 భాగంగానే వయనాడ్‌ బాధితులను ఆదుకునేందకు సౌత్‌ ఇండియా సినిమా హీరోలు ఒక్కొక్కరిగా ముందుకు వస్తున్నారు. టాలీవుడ్‌ నుంచి అ‍ల్లు అర్జున్‌ మొదటగా రూ. 25 లక్షలు విరాళం ప్రకటించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌ చరణ్‌ భారీ విరాళం అందించి తమ మంచి మనసు చాటుకున్నారు. వీరితోపాటు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన సైతం సహాయంగా 10 లక్షల రూపాయలను విరాళంగా అందించింది. దీంతో రష్మిక మంచి మనసుకు అందరూ ఫిదా అయిపోతున్నారు. రష్మికే కాదు, రష్మిక మనసు

 కూడా అందమైనదేనంటూ కితాబులిస్తున్నారు. అయితే తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ వ‌య‌నాడ్ బాధితుల స‌హాయ‌ర్థం కేర‌ళ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.2 కోట్ల భారీ విరాళం ప్ర‌క‌టించాడు. ప్ర‌కృతి విప‌త్తు కార‌ణంగా అక్క‌డి ప్ర‌జ‌లు తీవ్రంగా న‌ష్ట‌పోయారని.. వారికి అంద‌రూ త‌మ‌వంతు సాయం అందించాల‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న పిలుపునిచ్చాడు. అయితే కేవలం వీరే కాకుండా నిర్మాత నాగవంశీ ఐదు లక్షలు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. హీరోయిన్‌ సంయుక్త మీనన్‌ కూడా కొంత విరాళాన్ని అందించింది... మరోవైపు కేరళా కోసం ఇతర భాషల సెలబ్రిటీలు కూడా స్పందించారు. సూర్య, కార్తి, జ్యోతిక కలిసి యాభై లక్షలు అందించారు. విక్రమ్‌ 25 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఇక మాలీవుడ్‌ స్టార్స్ మమ్ముట్టి, దుల్కర్‌, మోహన్‌లాల్‌, వంటి మలయాళ తారలు కూడా కేరళ కోసం తమవంతు సాయాన్ని ప్రకటించారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: