నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి బాబి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి మేకర్స్ ఇప్పటి వరకు టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ సినిమా బాలయ్య కెరియర్లో 109 వ మూవీగా రూపొందుతున్న నేపథ్యంలో ఈ సినిమాను NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తూ వస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే చాలా భాగం పూర్తయింది. అయినప్పటికీ ఈ సినిమాను ఏ తేదీన విడుదల చేస్తారు అనే విషయాన్ని మేకర్స్ ప్రకటించలేదు.

అలాగే ఈ సినిమా టైటిల్ ను కూడా అనౌన్స్ చేయలేదు. దానితో బాలయ్య అభిమానుల త్వరగా ఈ సినిమా టైటిల్ మరియు విడుదల తేదీని అనౌన్స్ చేస్తే బాగుంటుంది అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించకపోవడంతో ఈ మూవీ ని ఆ తేదీన విడుదల చేయనున్నారు ... ఈ తేదీన విడుదల చేయనున్నారు అని అనేక వార్తలు బయటకు వస్తున్నాయి. అలాగే ఈ సినిమాకు అలాంటి టైటిల్ అనుకుంటున్నారు ... ఇలాంటి టైటిల్ అనుకుంటున్నారు అని కూడా వార్తలు వస్తున్నాయి.

ఇకపోతే మొదటి నుండి కూడా ఈ మూవీ లో బాలయ్య సరసన ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైన చాలా రోజుల వరకు ఈ మూవీ బృందం ఈ సినిమాలో హీరోయిన్లుగా ఎవరు నటించబోతున్నారు అనే విషయాన్ని ప్రకటించలేదు. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ లో ఏకంగా ముగ్గురు హీరోయిన్లు కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఊర్వశి రౌటేలా , ప్రగ్యా జైస్వాల్ తో పాటు శ్రద్ధ శ్రీ నాథ్ కూడా హీరోయిన్ గా కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా బాలయ్య ఈ సినిమాలో ముగ్గురు మోస్ట్ బ్యూటిఫుల్ నటిమనులతో ఆడి పాడనున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

nbk