హరీష్ శంకర్‌ దర్శకత్వంలో  మాస్ మహారాజా రవితేజ తాజాగా నటిస్తున్న సినిమా "మిస్టర్ బచ్చన్". ఇక ఇందులో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హిరోయిన్ గా నటించింది. అంతే కాకుండా ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్రలో నటించారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, పోస్టర్స్, సాంగ్స్ సోషల్ మీడియాలో లో దుమ్ము రేపుతున్నాయి. దానితో ఈ సినిమా పై ప్రేక్షకులలో మరింత భారీ అంచనాలను క్రియేట్ అయ్యాయి. ఇది ఎలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను కూడా విడుదల

 చేయబోతున్నారు. ఇది ఇలా ఉంటే రవితేజ హీరోగా నటిస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమాలో యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ గెస్ట్ రోల్ లో కనిపిస్తాడని కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో రూమర్స్ వినిపించాయి. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ సినిమా సెకండ్ ఆఫ్ లో సిద్ధు జొన్నలగడ్డ ఫైట్ సీక్వెన్స్‌లో కనిపిస్తాడు. దాదాపు రెండు మూడు నిమిషాల పాటు సిద్ధు క్యామియో ఉంటుందని అంటున్నారు. ఇక సిద్ధు "మిస్టర్ బచ్చన్‌" చిత్రంలో గెస్ట్ రోల్ చేస్తున్నారనే వార్త తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ వార్త ఉత్సాహభరితం చేస్తుంది. ఈ వార్త

 ఎంతవరకు నిజమో తెలియాలంటే చిత్రం విడుదల అయ్యే వరకు ఆగాల్సిందే. కానీ సిద్ధు ఈ చిత్రంలో చేస్తున్న గెస్ట్ రోల్ గురించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారికంగా ప్రకటన రాలేదు. ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో సిద్ధుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన కామెడీ టైమింగ్, అభినయంతో ప్రేక్షకులను అలరించిన సిద్ధు, "మిస్టర్ బచ్చన్‌" చిత్రంలో తన ఎంట్రీతో ఈ చిత్రానికి మరింత హైప్ తీసుకువచ్చారు అని చెప్పవచ్చు. సిద్ధు ఫ్యాన్స్‌కు ఇది పండగే అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా ఈ సినిమాను ఈ ఆగస్టు 15న గ్రాండ్ రిలీజ్ కానుంది. అయితే సినిమా రిజల్ట్ పై టీమ్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నందున వారు ఆగస్టు 14న పెయిడ్ ప్రీమియర్‌లతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: