టాలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడిగా తనకంటూ ఒక మంచి క్రేజ్ ను ఏర్పరచుకున్న వారిలో హరీష్ శంకర్ ఒకరు. ఈయన మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన షాక్ అనే మూవీ తో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టాడు. ఈ సినిమాలో జ్యోతిక హీరోయిన్గా నటించింది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత కూడా ఈ దర్శకుడు పై చాలా నమ్మకంతో రవితేజ రెండవ సినిమా అవకాశం ఇచ్చాడు. దానితో హరీష్ శంకర్ "మిరపకాయ్" అనే సినిమాను రవితేజతో తెరకెక్కించాడు.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఈ మూవీ ద్వారా హరీష్ శంకర్ కి మంచి గుర్తింపు లభించింది. ఈ దర్శకుడు కొన్ని సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కించిన గబ్బర్ సింగ్ మూవీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో ఈ దర్శకుడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇకపోతే తాజాగా హరీష్ శంకర్ , మాస్ మహారాజా రవితేజ హీరోగా భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా మిస్టర్ బచ్చన్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ సినిమాను ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాతోనే భాగ్య శ్రీ తెలుగు తెరకు పరిచయం కానుంది. ఇకపోతే తాజాగా ఫ్రెండ్షిప్ డే జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే.

దానితో మిస్టర్ బచ్చన్ మూవీ యూనిట్ మొత్తం ఫ్రెండ్షిప్ డే వేడుకలను ఘనంగా చేసుకున్నారు. ఈ ఈవెంట్ కు ఈ సినిమాలో నటించిన నటి నటులు , టెక్నీషియన్స్ అంతా పాల్గొన్నారు. అందులో భాగంగా భాగ్య శ్రీ ముందు నడుస్తూ ఉంటే వెనకాల దర్శకుడు హరీష్ శంకర్ ఉన్న ఒక ఫోటోను ప్లే చేశారు. ఇక ఈ ఫోటోకి హరీష్ శంకర్ సమాధానమిస్తూ.. ప్రతి అమ్మాయి సక్సెస్ వెనక కూడా ఒక అబ్బాయి ఉంటాడు. అలాగే భాగ్య శ్రీ విజయం వెనక నేను ఉంటాను అని ఆ ఫోటో అర్ధం అని ఈ దర్శకుడు చెప్పాడు. ఇక ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: