టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడిగా , నిర్మాతగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో బండ్ల గణేష్ ఒకరు. కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాలలో చిన్న చిన్న పాత్రల్లో నటించిన బండ్ల గణేష్ వాటి ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. చాలా సంవత్సరాల పాటు నటుడు గానే కెరీర్ ను కొనసాగించిన ఈయన మాస్ మహారాజా రవితేజ హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఆంజనేయులు మూవీ తో నిర్మాతగా కెరియర్ ను మొదలు పెట్టాడు. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా తీన్మార్ సినిమాను తెరకెక్కించాడు.

ఆంజనేయులు , తీన్మార్ రెండు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాలను అందుకోలేదు. ఆ తర్వాత ఈయన పవన్ కళ్యాణ్ హీరోగా గబ్బర్ సింగ్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ కావడంతో నిర్మాతగా బండ్ల గణేష్ కు మంచి గుర్తింపు లభించింది. బండ్ల గణేష్ ఆ తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా బాద్ షా  , టెంపర్ మూవీలను తెరకెక్కించగా , అల్లు అర్జున్ హీరోగా ఇద్దరమ్మాయిలతో , రామ్ చరణ్ హీరోగా గోవిందుడు అందరివాడేలే సినిమాలను తెరకెక్కించాడు.

బాద్ షా , టెంపర్ , గోవిందుడు అందరివాడేలే ఇలా బండ్ల గణేష్ రూపొందించిన ఈ మూడు సినిమాలలో కూడా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించింది. ఈయన తెరకెక్కించిన సినిమాలలో మూడింట్లో కూడా కాజల్ హీరోయిన్గా తీసుకోవడానికి ప్రధాన కారణం ఆమె అద్భుతమైన నటి కావడం , అలాగే పారితోషకం విషయంలో కూడా నిర్మాతలను పెద్దగా ఇబ్బంది పెట్టకపోవడం , ఇలా మరికొన్ని పాజిటివ్ కారణాల వల్ల ఈమెను బండ్ల గణేష్ తాను నిర్మించిన సినిమాలలో ఎక్కువ సార్లు హీరోయిన్గా తీసుకున్నట్లు , అలాగే నిర్మాతలు , హీరోయిన్లు కూడా ఆమె వైపు మొగ్గు చూపడంతో ఆయన కూడా అలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: