ఏ సినీ ఇండస్ట్రీలో నైనా సరే కచ్చితంగా అభిమానులు , సినీ ప్రేక్షకులకు ఏవైనా ఇబ్బందులు ఉన్నాయంటే కచ్చితంగా సహాయం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వరదల వల్ల వర్షాల వల్ల నష్టపోయారు అంటే కచ్చితంగా సెలబ్రెటీలు సైతం చాలా మంది స్పందిస్తూ భారీ విరాళాలను అందిస్తూ ఉంటారు. గత కొద్ది రోజుల నుంచి కేరళ ప్రాంతంలో ఉండేటువంటి వయానాడ్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా వరదల వల్ల ఒక్కసారిగా కేరళ లో బీభత్సవం సృష్టించింది. దీంతో సుమారుగా 350 మందికి పైగా మరణించినట్లు సమాచారం. మరి కొంత మంది  ఆచూకీ ఇంకా తెలియలేదట.ఈ క్రమంలోనే వీరిని ఆదుకునేందుకు సైతం సినీ సెలబ్రిటీలు భారీగానే విరాళాలు అందించినట్లు తెలుస్తోంది.


ఇప్పటికే తమిళ సెలబ్రిటీలు కూడా తమకు తోచినంత మొత్తంలో విరాళాలను ప్రకటించారు.  టాలీవుడ్ పరిశ్రమకి వస్తే అల్లు కుటుంబం నుంచి అల్లు అర్జున్ మెగా కుటుంబం నుంచి రామ్ చరణ్, చిరంజీవి వంటి వారు కూడా విరాళాలను ఇచ్చారు ఇప్పుడు తాజాగా ప్రభాస్ కూడా వీరీ లిస్టులోకి చేరినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ 25 లక్షలు ఇచ్చారట. చిరంజీవి , చరణ్ ఇద్దరు కలిసి కోటి రూపాయల వరకు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఏకంగా ప్రభాస్ మాత్రం రెండు కోట్ల రూపాయల వరకు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇచ్చినట్లు తెలుస్తోంది.


అయితే ఈ విషయాన్ని ఎక్కడా కూడా ప్రభాస్ కానీ ఆయన టీం కానీ తెలియజేయలేదు. ఈ విషయాన్ని కేరళ ప్రభుత్వమే తెలియజేసింది. ఇప్పటికే దక్షిణాది సినీ ఇండస్ట్రీ నుంచి సూర్య ఫ్యామిలీ, రష్మిక, ఫహాద్ ఫాజిల్, నయనతార తదితర సెలబ్రిటీలు కూడా భారీ గాని విరాళం ఇచ్చారు. అయితే ఇప్పటికే టాలీవుడ్ సెలబ్రిటీలలో చాలా మంది సెలబ్రిటీల అభిమానులు కూడా తమ హీరోలు కూడా వరద బాధితులకు సహాయం చేయాలి అంటు తెలియజేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఎవరెవరు చేస్తారేమో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: