హిందీ వర్షన్ లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 3 సౌత్ మూవీస్ ఏవో తెలుసుకుందాం.

రెబల్ స్టార్ ప్రభాస్ కొన్ని సంవత్సరాల క్రితం బాహుబలి పార్ట్ 2 మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించగా ... మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణులు అయినటువంటి అనుష్క , తమన్నా ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా హిందీ వర్షన్ కి 511 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇప్పటి వరకు సౌత్ సినిమా ఇండస్ట్రీ నుండి విడుదల అయిన సినిమాలలో హిందీ వర్షన్ లో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో ఈ మూవీ మొదటి స్థానంలో ఉంది.

యాష్ హీరోగా శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ హిందీ వర్షన్ కి 435.2 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఎప్పటి వరకు హిందీ వర్షన్ లో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సౌత్ సినిమాల లిస్టులో ఈ మూవీ రెండవ స్థానంలో ఉంది.

ప్రభాస్ హీరోగా దిశా పటాని హీరోయిన్ గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD సినిమా జూన్ 27 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమా హిందీ వర్షన్ కి 39 రోజుల్లో 290.62 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ప్రస్తుతం కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్లను వసూలు చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా హిందీ వర్షన్ సౌత్ నుండి విడుదల అయిన సినిమాల్లో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన మూవీలలో మూడవ స్థానంలో ఉంది. ఇకపోతే ఈ సినిమాలో అమితా బచ్చన్ , దీపికా పదుకొనే కీలకమైన పాత్రలలో నటించగా ... విజయ్ దేవరకొండ , దుల్కర్ సల్మాన్ , రాజేంద్ర ప్రసాద్ , శోభన , మ్రోణాల్ ఠాకూర్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. ఎస్ ఎస్ రాజమౌళి , రామ్ గోపాల్ వర్మ , అనుదీప్ కే విమూవీ లో చిన్న చిన్న క్యామియో పాత్రలో కనిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: