పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. ఇటీవల కల్కి సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ .అయితే కేవలం సినిమాలతోనే కాకుండా ఆయన నిజజీవితంలో కూడా హీరో అని అనిపించుకున్నాడు. ఎలా అంటే.. వయనాడ్ విపత్తు బాధితుల సహాయార్థం కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రెబల్ స్టార్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్  2 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి 360 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

 విపత్తు బాధితులకు అండగా నిలబడేందుకు సినీ పరిశ్రమలోని పలువురు స్టార్స్ విరాళాలు ఇస్తున్నారు.ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు సాయం ప్రకటించారు. ఇప్పుడు ఈ జాబితాలో ప్రభాస్ కూడా చేరారు. ఇటీవల మోహన్ లాల్ రూ.3 కోట్లు ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రూ.కోటి విరాళాన్ని ప్రకటించారు. అల్లు అర్జున్ రూ.25 లక్షలను కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చారు. న‌య‌న‌తార‌, విఘ్నేశ్ దంప‌తులు రూ.20 లక్షలు, హీరో విక్రమ్ రూ.20 లక్షలు, హీరో సూర్య, జ్యోతిక, కార్తి సంయుక్తంగా రూ.50

 లక్షలు అందించారు. నటులు మమ్ముట్టి, దుల్కర్‌ సల్మాన్‌ కలిసి రూ.35 లక్షలు, ఫహాద్‌ ఫాజిల్‌ రూ.25 లక్షలు ఇచ్చారు. హీరోయిన్ రష్మిక రూ.10 లక్షలు ఇచ్చారు. అయితే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్  గురించి ఈ విషయంతో మరో విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రభాస్‌ ఒక పాఠశాలలో ప్రతియేటా 100 పిల్లలను చదివిపిస్తున్నట్లు.. ఆ 100 మంది పిల్లలకు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ దగ్గరుండి స్కూల్ ఫీజుతో పాటు, బట్టలు దగ్గర నుంచి పిల్లలకు కావాల్సిన అన్ని అవసరాలను తీరుస్తున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: