RRR సినిమా తర్వాత, రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమా కోసం తమిళ దర్శకుడు శంకర్‌ని ఎంచుకున్నారు. ఈ సినిమాకు 'గేమ్ ఛేంజర్' అనే పేరు పెట్టారు. షాకింగ్ విషయం ఏమిటంటే, ఈ సినిమా చిత్రీకరణ చాలా కాలంగా జరుగుతోంది. దర్శకుడు శంకర్ రామ్ చరణ్ సినిమాను ఆపేసి 'ఇండియన్ 2' అనే సినిమాను మధ్యలో పునః ప్రారంభించాడు. అది పూర్తి చేసి విడుదల చేశాడు. అదే సమయంలో, 'గేమ్ చేంజర్' సినిమా కొంచెం వెనకబడిపోయింది.
దురదృష్టవశాత్తు, 'ఇండియన్ 2' సినిమా ఆశించినంతగా ఆడలేదు. అయితే శంకర్ నెక్స్ట్ మూవీ 'గేమ్ చేంజర్' సినిమా హిట్ కావడం శంకర్‌కి చాలా అవసరం గా మారింది. ఆయన చాలా సమయం తీసుకున్నాడు, నిర్మాత దిల్ రాజు శంకర్ అడిగినంత డబ్బులు ఈ మూవీ కోసం ఇచ్చాడు, రామ్ చరణ్ కూడా సినిమా లేట్ అయినా చాలా ఓపికగా ఉన్నాడు.
రామ్ చరణ్, దిల్ రాజు శంకర్‌పై చాలా నమ్మకంతో ఉన్నారు. అందుకే శంకర్ ఈ సినిమాతో పెద్ద హిట్ అందించాల్సి ఉంది. రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో తన సినిమా మధ్యలో దర్శకుడుని వేరే సినిమా చేయనివ్వడు. ముఖ్యంగా rrr లాంటి పెద్ద సినిమా తర్వాత ఎవరైనా తమ నెక్స్ట్ మూవీ త్వరగా రావాలని ఆ క్రేజ్ తగ్గించుకోకుండా ఉండాలని అనుకుంటారు. శంకర్ చాలా గొప్ప దర్శకుడు అయినప్పటికీ, ఆయన సినిమాలు ఇటీవల బాగా ఆడటం లేదు. 'గేమ్ ఛేంజర్' సినిమాను ఆయన ఏమాత్రం తేలికగా తీసుకోకూడదు.
'గేమ్ ఛేంజర్' మూవీ మేకర్స్ ఈ సినిమా ఈ క్రిస్మస్‌కి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే డబ్బింగ్ పనులు మొదలయ్యాయి. అంటే, శంకర్ రామ్ చరణ్, దిల్ రాజు ఇచ్చిన అవకాశానికి తగిన ఫలితం ఇచ్చారా లేదా అన్నది చూడడానికి ఇంకా ఎక్కువ రోజులు లేవు.