రామ్ పూరీ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ కొట్టడంతో మళ్లీ ఇద్దరు కలిసి డబుల్ ఇస్మార్ట్ అని మరో ప్రయత్నం చేశారు. ఇండిపెండెన్స్ డే రోజు రిలీజ్ అవుతున్న డబుల్ ఇస్మార్ట్ మీద ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. రామ్ సరసన కావ్యా థాపర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ కూడా హెల్ప్ అయ్యింది. ఐతే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కావ్యా థాపర్ తన గ్లామర్ షోతో సత్తా చాటేలా ఉంది. ఐతే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అమ్మడు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది.

ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించేందుకు పూరీ ఆడిషన్స్ నిర్వహించగా అప్పుడు కూడా ఆ సినిమా కోసం కావ్య ఆడిషన్ ఇచ్చిందట. ఐతే ఆ సినిమాలో నిధి అగర్వాల్, నభా నటేష్ లు ఎంపిక చేశాడు పూరీ. ఐతే మళ్లీ ఈ సినిమా సీక్వెల్ లో హీరోయిన్స్ కావాలని తెలిసి మరోసారి ఆడిషన్ ఇచ్చిందట కావ్య. అలా మొదటి పార్ట్ కోసం ఆడిషన్ ఇచ్చి మళ్లీ సీక్వెల్ లో ఛాన్స్ అందుకుంది అమ్మడు. డబుల్ ఇస్మార్ట్ సినిమాలో కావ్య థాపర్ అందాలనే హైలెట్ చేస్తూ సత్తా చాటేలా ఉందని అంటున్నారు.

డబుల్ ఇస్మార్ట్ సినిమా తప్పకుండా మాస్ ఆడియన్స్ ను మెప్పించే కంటెంట్ తో ఉంటుందని టాక్. ఐతే రామ్  కూడా ఈ సినిమాపై సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. రామ్ తో పూరీ మరో సూపర్ హిట్ కొట్టేందుకు డబుల్ ఇస్మార్ట్ తో వస్తున్నాడు. మణిశర్మ మ్యూజిక్ మరోసారి డబుల్ ఇస్మార్ట్ కి జోష్ ఇచ్చింది. మరి లైగర్ తో పూరీ మళ్లీ వెనక్కి వెళ్లగా డబుల్ ఇస్మార్ట్ హిట్ కొట్టి తిరిగి ఫాం లోకి వస్తాడా లేదా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: